RENDER TRANSPARENT SERVICES TO PILGRIMS_ శ్రీవారి భక్తులకు ఉన్నత ప్రమాణాలతో సేవలందించండి కల్యాణకట్ట క్షురకులకు తిరుమల జెఈవో పిలుపు

Tirumala, 3 December 2017: Kalyanakatta barbers should offer transparent services to multitude of visiting pilgrims to Tirumala with devotion and discipline, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.

Addressing 463 kalyanakatta srivari seva barbers in Astana Mandapam at Tirumala on Sunday evening, the JEO said, TTD has taken stern measures against the barbers who are alleged of demanding money from pilgrims for tonsuring activity.

“The management has no vested interest to give you punishment. Our intention is to to safeguard the reputation of the institution and remind you about your responsibilities. TTD EO Sri Anil Kumar Singhal is kind enough to give you another opportunity and overcome these allegations. Hence you are reinstated in service from January 1″, he added.

The JEO said, after darshan of Lord Venkateswara, tonsuring is considered to be more pious activity by pilgrims. So live up to the image of pilgrims with your transparent services and enhance the fame of the institution”, he reiterated.

CVSO Sri A Ravikrishna, KKC DyEO Smt Naharatna, AEO Sri Nagaraju, VGO Sri Ravindra Reddy were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

శ్రీవారి భక్తులకు ఉన్నత ప్రమాణాలతో సేవలందించండి కల్యాణకట్ట క్షురకులకు తిరుమల జెఈవో పిలుపు

తిరుమల 03 డిసెంబరు, 2017: అఖిలండకోటి బ్రహ్మండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి విచ్చేసే లక్షలాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించే తలనీలాలు తీసే క్షురకులు పారదర్శకంగా సేవలు అందిస్తూ, సంస్థ ఉన్నతికి మరింతగా పాటుపడాలని తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌ శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు. తిరుమలలోని ఆస్థాన మండసంలో ఆదివారం దాదాపు 450 మందికి పైగా కల్యాణకట్ట శ్రీవారి సేవకుల క్షురకులతో ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ స్వామివారి దర్శనానంతరం భక్తులు అత్యంత పవిత్రంగా భావించి తలనీలాలు సమర్పిస్తారని, అటువంటి పవిత్రమైన వృత్తిలో క్షురకులు భక్తులకు విశేష సేవలందిస్తున్నారని వివరించారు. ఇటీవల కొందరు క్షురకులపై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో టిటిడి చర్యలు తీసుకున్నదన్నారు. కొందరు క్షురకుల అభ్యర్ధన మేరకు మరో అవకాశం ఇవ్వాలని టిటిడి యాజమాన్యం భావించి, వారికి 2018 జనవరి 1వ తేదీ నుండి విధుల్లోకి తీసుకుంటున్నామని అన్నారు. మరోసారి అలాంటి తప్పులు చేయకుండా, సంస్థ ప్రతిష్ట పెంచేలా విధులు నిర్వహించాలని కోరారు. క్షురకులలో మరింత క్రమశిక్షణ, పారదర్శకత పెంచేలా టిటిడి ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాలు కృషి చేస్తున్నారని, వారి ఆశయాలకు అనుకునంగా క్షురకులు విధులు నిర్వహించాలని కోరారు.

అంతకుముందు సివిఎస్వో శ్రీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ త్వరలో తిరుమలలో అత్యంత ఆధునిక కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శ్రీవారి సేవకుల క్షురకులు అవినీతికి పాల్పడకుండా విశేష సేవలందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కల్యాణకట్ట డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, విజివో శ్రీ రవీంద్రరెడ్డి, ఏఈవో శ్రీ నాగరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.