JEO INSPECTION OF TIRUMALA WORKS_ తిరుమలలోని పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించిన తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 22 Jan. 19: Tirumala Joint Executive Officer Sri KS Sreenivasa Raju today went around Tirumala and inspected progress of various developmental works underway.

He inspected the new drainage and street lights works and new RO plant for drinking water at the Balaji nagar.

He directed the officials to take up developmental works of the Sri Vinayaka Swami temple.

He said he was informed if the civic issues of the Balaji nagar and that the TTD will strive to resolve them. He also interacted with locals on the there burning issues and the TTD works.

He also visited the kitchen at PAC-2 from where food was supplied to all food courts I Tirumala.

SE-2 Sri Ramachandra Reddy and SE-Electrical Sri Venkateswarlu, Health Officer Dr Sharmista and other officials participated in the inspection visits.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

తిరుమలలోని పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించిన తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

తిరుమల, 22 జనవరి 2019: కలియుగ వైకుంఠమైన తిరుమలలోని పలు ప్రాంతాలలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు మంగళవారంనాడు అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు.

అందులో భాగంగా తిరుమ‌ల‌లోని బాలాజి నగర్‌లో నూత‌నంగా నిర్మిస్తున్న డ్రైనేజి, విద్యుత్ దీపాలు త‌దిత‌ర వాటిని ప‌రిశీలించారు. అక్క‌డి స్థానికుల‌కు తాగునీరు అందించేందుకు నూత‌నంగా ఏర్పాటు చేస్తున్న ఆర్ఒ ప్లాంట్‌ను పరిశీలించారు. శ్రీ వినాయ‌క‌స్వామివారి ఆల‌య అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలాజి నగర్‌లోని సమస్యలను స్థానికులు తనకు తెలియచేశారని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. అనంతరం అక్కడి స్థానికులకు టిటిడి చేస్తున్న అభివృద్ధి పనులను, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అంత‌కుముందు పిఏసి-2లోని వంటశాలను ప‌రిశీలించి, దీనిని విస్తరించడానికి ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఇ.2 శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్ఇ ఎల‌క్ట్రిక‌ల్ శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.