TIRUMALA JEO INSPECTS NARAYANAYAGIRI QUEUE LINES_ సర్వదర్శనం క్యూలైన్లను తణిఖీ చేసిన తిరుమల జెఈవో

Tirumala, 31 March 2018: The series of holidays added to the week end rush in Tirumala and the Narayanagiri queue lines spilled outside.

Tirumala JEO Sri KS Sreenivasa Raju inspected the serpentine queue lines in Narayanagiri Gardens along with senior officers on Saturday evening.

Speaking to media the JEO said, as the annual examinations for Tenth and Inter are already over in AP, the Pilgrim rush has increased from the last few days.he said it is taking about 18 hrs.for sarva darshan. The Pilgrims who have taken Rs.300 and divya darshan should join the lines in their allotted hour only and co-operate with TTD management”, he appealed to pilgrims.

SE 2 Sri Ramachandra Reddy, DyEO Sri Harindranath, Anna prasadam SO Sri Venugopal, Health Officer Dr Sermista , VSO Sri Ravindra Reddy were also present during inspection.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సర్వదర్శనం క్యూలైన్లను తణిఖీ చేసిన తిరుమల జెఈవో

మార్చి 31, తిరుమల 2018: వేసవి సెలవులు ప్రారంభం కావడంతో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిందని, సిబ్బంది అప్రమత్తంగా ఉండి, వేగంగా, నాణ్యతతో సేవలందించాలని టిటిడి తిరుమల జేఈవో శ్రీ కెఎస్‌. శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం తిరుమల నారాయణగిరి ఉద్యాణవనాలలోని సర్వదర్శనం, దివ్యదర్శనం క్యూలైన్లను అధికారులతో కలిసి జెఈవో తణిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఈవో మీడియాతో మాట్లాడుతూ వరుస శెలవుల రావడంతో శ్రీవారి దర్శనార్థం భక్తులు వేలాదిగా తరలివస్తున్నారని, ఇప్పటికే సర్వదర్శనం క్యూలైన్‌ 3 కిలోమీటర్లమేర ఉన్నదని తెలిపారు. వీరికి శ్రీవారి దర్శనం దాదాపు 10 నుండి 18 గంటల సమయం పడుతుందని వివరించారు. కావున ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300/-, కాలినడకన విచ్చేసే దివ్యదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు వారికి సూచించిన సమయానికే క్యూలైన్‌ల వద్దకు చేరుకుని సిబ్బందికి సహరించవలసిందిగా కోరారు. భక్తుల రద్దీ దృష్ట్యా విఐపి బ్రేక్‌ దర్శనాన్ని పరిమిత సంఖ్యలో ఇవ్వనున్నట్లు తెలిపారు. తద్వారా సామాన్య భక్తులు ఎక్కువమంది శ్రీవారిని దర్శించుకుంటారని తెలియచేశారు.

అంతకుముందు జెఈవో అధికారులతో కలిసి క్యూ లైన్లలోని భక్తులకు శ్రీవారిసేవకులు అందిస్తున్న అన్నప్రసాదాలు, తాగునీరు, పాలును పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ 2 శ్రీ రామచంద్రారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, ఆరోగ్య విభాగం అధికారిణి డా|| శర్మిష్ఠ, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.