VASANTHOTSAVAM CONCLUDES ON A GRAND NOTE IN TIRUMALA_ వైభవంగా ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

NINE UTSAVARULU RENDERED SNAPANAM

Tirumala, 31 March 2018: The annual three-day Salakatla Vasanthotsavams concluded on a grand religious note in Tirumala on Saturday.

On the final day Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi, Sri Rama with Sita Devi, Lakshmana Swamy and Anjaneya and Sri Krishna Swamy with Rukmini Devi were rendered celestial bath.

It was a visual feast to the devotees to witness the snapana tirumanjanam to all the nine utsavarulu at a time.

This religious event took place between 2pm and 4pm in Vasantha Mandapam. The entire premises reverberated to the rhythmic chanting of vedic mantras while the snapanam was under way.

TTD has cancelled Kalyanotsavam, Arjitha Brahmotsavam, Vasanthotsavam and Sahasra Deepalankara Sevas in connection with Salakatla Vasanthotsavam. All the arjitha sevas will resume in Tirumala temple from April 1 on wards.

TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh and devotees witnessed the celestial event.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైభవంగా ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

మార్చి 31, తిరుమల 2018: గత మూడురోజులుగా తిరుమలలోని వసంతోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్న సాలకట్ల వసంతోత్సవాలు శనివారంనాడు కన్నుల పండుగగా ముగిశాయి.

తొలిరోజు, రెండవరోజు శ్రీ మలయప్ప స్వామివారు తన ఉభయ దేవేరులతో కూడి వసంతోత్సవంలో పాల్గొనగా చివరిరోజున మలయప్పతో బాటుగా శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారు, శ్రీరుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది.

కాగా మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఒకే వేదికపై సమస్త మూలవరులను దర్శించిన భక్తులు తన్మయత్వంతో పులకించారు.

వసంతోత్సవ వేడుకలను పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెతవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

అదేవిధంగా ప్రతినెలా పౌర్ణమినాడు తిరుమలలో నిర్వహించే గరుడుసేవను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ్యర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ్యర్‌స్వామి, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్‌, ఇతర తదితరులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.