SRI RAMA IN SIVADHANURBHANGA ALANKARAM BLESSES DEVOTEES _ శివధనుర్భంగాలంకారంలో రాములవారి రాజసం

VONTIMITTA, 05 APRIL 2023: Sri Kodandarama Swamy in Siva Dhanurbhanga Alankaram blessed devotees on Wednesday morning.

As part of the ongoing annual brahmotsavam at Vontimitta in YSR Kadapa district, Sri Rama paraded all along the four mada streets.

Amidst the kolatam, traditional drum beats and other performances by various artists, the procession took place with celestial grandeur.

Deputy EO Sri Natesh Babu, Special Officer Manuscripts Smt Vijayalakshmi and other officials were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శివధనుర్భంగాలంకారంలో రాములవారి రాజసం
 
ఒంటిమిట్ట, 2023 ఏప్రిల్ 05: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధవారం ఉదయం శివధనుర్భంగాలంకారంలో రాములవారి రాజసం భక్తులకు కనువిందు చేసింది. ఉదయం 8 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
 
స్వయంవరం సమయంలో శ్రీరాముడు శివుని విల్లును విరిచి సీతమ్మవారిని వివాహమాడే ఘట్టాన్ని గుర్తుచేసేది శివధనుర్భంగాలంకారం. సీతారాముల కల్యాణం రోజున ఉదయం ఈ అలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ నటేష్ బాబు, మాన్యుస్క్రిప్ట్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీమతి విజయలక్ష్మి, ఏఈఓ శ్రీ గోపాలరావు, సూపరింటెండెంట్లు శ్రీ పి.వెంకటేశయ్య, శ్రీ ఆర్సీ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయ తదితరులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.