JEO INSPECTS QUEUE LINES IN TIRUMALA_ క్యూలైన్లను పరిశీలించిన ఇన్‌చార్జి ఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 21 October 2017: Owing to unexpected pilgrim crowd in Tirumala on Saturday, In-charge EO Sri KS Sreenivasa Raju inspected the queue lines extended in Narayanagiri Gardens along with senior officers.

Later speaking to media persons he said, there was a heavy surge in week end pilgrim rush. “This was an unexpected rush. The pilgrims thronged to the temple temple even after the completion of the auspicious Tamil Peratasi month which was over by last week. I urge the pilgrims to co-operate with the TTD and police and have a hassle free darshan of Lord Venkateswara”, he added.

He later directed the health, annaprasadam wings to make sufficient arrangements of food and water to pilgrims waiting in queue lines and compartments. Later he monitored the movement of queue lines in Vaikuntham and temple.

DyEO Annaprasadam Sri Venugopal, Temple Sri Kodanda Rama Rao, Catering Officer Sri Shastry, Health Inspector Sri Krishnaiah and others were also present.

PROF.KS RAO INSPECTS GHAT ROADS

With the incidence of boulders which fell in both the ghat roads due to rains about 10 days ago, Prof.KS Rao, from IIT New Delhi paved a visit to hill town and inspected both the ghat roads on Saturday.

The In-charge EO Sri KS Sreenivasa Raju said, the IIT expert will soon give a report on the scientific methods to over come the problem of boulders in the ghat roads.

SE II Sri Ramachandra Reddy, EEs Sri Sivaram Prasad, Sri Prasad, DyEE Sri Surendra Reddy and others were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

క్యూలైన్లను పరిశీలించిన ఇన్‌చార్జి ఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

అక్టోబరు 21, తిరుమల, 2017: తిరుమలలో శనివారం నాడు భక్తుల రద్దీ పెరగడంతో నారాయణగిరి ఉద్యానవనాల్లోని క్యూలైన్లను సీనియర్‌ అధికారులతో కలిసి టిటిడి ఇన్‌చార్జి ఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఇన్‌చార్జి ఈవో మీడియాతో మాట్లాడుతూ వారాంతంలో ఊహించని విధంగా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిందన్నారు. గత శనివారంతో తమిళ పెరటాసి నెల ముగిసినా భక్తుల రద్దీ కొనసాగుతోందని చెప్పారు. భక్తులు క్యూలైన్లలో సంయమనంతో వ్యవహరించాలని, టిటిడి, పోలీసు సిబ్బందికి సహకరించి ఎలాంటి తోపులాటల్లేకుండా స్వామివారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదాలు, తాగునీరు అందించాలని అన్నప్రసాద, ఆరోగ్య విభాగాల అధికారులను ఇన్‌చార్జి ఈవో ఆదేశించారు.

ఇన్‌చార్జి ఈవో వెంట శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, అన్నప్రసాదం డెప్యూటీ ఈవో శ్రీ వేణుగోపాల్‌, క్యాటరింగ్‌ అధికారి శ్రీ శాస్త్రి, ఆరోగ్యశాఖాధికారి డా|| శర్మిష్ట తదితర అధికారులు ఉన్నారు.

ఘాట్‌ రోడ్లలో కొండచరియలను పరిశీలించిన ఐఐటి నిపుణుల బృందం

ఇటీవల వరుసగా కురిసిన వర్షాల నేపథ్యంలో తిరుమల మొదటి, రెండవ ఘాట్‌ రోడ్లలోని కొండచరియలను చెన్నై ఐఐటి నిపుణులు ప్రొఫెసర్‌ కె.ఎస్‌.రావు ఆధ్వర్యంలోని బృందం శనివారం ఉదయం పరిశీలించింది. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు కొండచరియలు విరిగిపడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనల కోసం ఐఐటి నిపుణులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా టిటిడి ఇన్‌చార్జి ఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఐఐటి నిపుణులు త్వరలో నివేదిక అందిస్తారని, ఈ మేరకు కొండ చరియలు విరిగిపడకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఇఇలు శ్రీ శివరామప్రసాద్‌, శ్రీప్రసాద్‌, డెప్యూటీ ఇఇ శ్రీ సురేంద్రరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.