JEO INSPECTS RADHASAPTHAMI ARRANGEMENTS_ రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో
Tirumala, 6 February 2019: Tirumala JEO Sri KS Sreenivasa Raju on Wednesday noon inspected the ongoing arrangements for Radha Sapthami in four mada streets surrounding Tirumala temple.
Later speaking to media persons, the JEO said, Sri Malayappa Swamy, the utsava deity will take celestial ride on seven different vahanams from morning to evening on a single day on February 12. The vahanam spree will commence with Surya Prabha Vahana seva in the morning at 5.30am and concludes with Chandra Prabha Vahana Seva in the night at 9pm.
“For nearly 18 hours all the staff who are deployed in mada streets will discharge their duties. Apart from the regular staff, about 3000 srivari sevakulu will also render services to pilgrs who will be waiting in 170 galleries spread in all four mada streets. The Anna prasadam wing has also set up 55 food courts to distribute food to pilgrims. The continuous cleaning by health department during interval time is also crucial”, he said.
The JEO said to shield pilgrims waiting in galleries from inclement weather conditions, the engineering wing has also set up temporary shed with protective covers.
SE 2 Sri Ramachandra Reddy, VGO Sri Manohar, Special Officer Anna prasadam Sri Venu Gopal, Chief Catering Officer Sri GLN Shastry, Temple Peishkar Sri Ramesh and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో
తిరుమల, 06 ఫిబ్రవరి 2019: తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 12వ తేదీన జరుగనున్న రథసప్తమి పర్వదినానికి విశేషంగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఆలయ మాడ వీధుల్లో చేపడుతున్న ఏర్పాట్లను టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో మొదలై రాత్రి 9.00 గంటల వరకు వరుసగా చిన్నశేష, గరుడ, హనుమంత వాహనాలు, చక్రస్నానం, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. భక్తులు చలికి, ఎండకు, వర్షానికి ఇబ్బందులు పడకుండా గ్యాలరీల్లో వేచి ఉండేందుకు వీలుగా తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. భక్తులకు ఉదయం నుండి రాత్రి వరకు టి, కాఫి, పాలు, తాగునీరు, మజ్జిగ, అల్పాహారం, అన్నప్రసాదాలు నిరంతరాయంగా పంపిణీ చేస్తామన్నారు. మాడ వీధుల్లో ఉన్న దాదాపు 170 గ్యాలరీల్లో అన్నప్రసాద వితరణకు 55 ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భక్తులకు సేవలందించేందుకు 300 మంది సిబ్బందికి డెప్యుటేషన్ విధులు కేటాయిస్తున్నట్టు తెలియజేశారు. ప్రతి గ్యాలరీలో శ్రీవారి సేవకులు, ఆరోగ్య సిబ్బంది ఉంటారని, సీనియర్ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. భక్తులు సంయమనంతో వ్యవహరించి గ్యాలరీల్లో వేచి ఉండి వాహనసేవలను తిలకించాలని కోరారు. భక్తులు వాహనసేవలను తిలకించేందుకు వీలుగా 20 ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేయడంతోపాటు విఐపి బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు పరిమితం చేశామని తెలిపారు. దివ్యదర్శనం, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కొనసాగుతాయన్నారు.
ముందుగా గ్యాలరీల్లో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక షెడ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మాడ వీధుల్లో తీర్చిదిద్దుతున్న రంగవల్లులను పరిశీలించారు.
జెఈవో వెంట టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, డిఇ శ్రీమతి సరస్వతి, విఎస్‌వో శ్రీ మనోహర్, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్, క్యాటరింగ్ అధికారి శ్రీ జిఎల్ఎన్.శాస్త్రి, పేష్కార్ శ్రీ రమేష్‌బాబు, యూనిట్ ఆఫీసర్ శ్రీ శ్రీనివాసమూర్తి, ఎవిఎస్‌వోలు శ్రీ గంగరాజు, శ్రీ చిరంజీవులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.