REGULAR INSPECTIONS TO SPEED UP VONTIMITTA DEVELOPMENT WORKS-TTD EO_ ఒంటిమిట్ట బ్రహ్మూత్సవాలలోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Vontimitta, 6 February 2019: To speed up major development works in Sri Kodanda Ramalayam at Vontimitta in YSR Kadapa district, before annual brahmotsavams, regular inspections will be carried out, said TTD EO Sri Anil Kumar Singhal.

Speaking to media here on Wednesday after inspecting the ongoing developmental works along with Tirupathi JEO Sri P Bhaskar, CVSO Sri Gopinath Jetti and CE Chandrasekhar Reddy, he said, the construction works at Kalyana Vedika are going on a fast pace. “During last month on January 2, we instructed the work contractors to complete all the construction of permanent structures before Brahmotsavams in second week of April here. Apart from this, the beautification and greenery works taken up Forest department will also be completed. Next month there will be another round of inspection by senior officers of TTD on March 7″, he added.

The EO said out of the Rs.100 crores works, already development works at a cost Rs.60.40crores have taken up which included construction of permanent Kalyana Vedika, toilets etc. The deployment of staff to the temple, infrastructure works etc. issues will be discussed in the TTD Board Meeting on February 19 in detail”, he added.

The EO further said, the annual brahmotsavams will commence on April 12 with Ankuarpanam while the big event Sita Rama Kalyanam will take place on April 18 and Pushpa yagam on April 22.

Suptd Engineers Sri Ramesh Reddy, Sri Venkateswarlu, DyCF Sri Phanikumar Naidu, Estate Officer Sri Vijay Sarathi, Temple DyEO Sri Natesh Babu, AEO Sri Ramaraju, Executive Engineer Sri Jaganmohan Reddy, Des Sri Ravishankar Reddy, Sri Chandrasekhar, Addl Health Officer Dr Sunil and others took part.

Later he reviewed the developmental works of Vontimitta Temple with Joint Collector, Kadapa, Sri P Koteswara Rao IAS, RDO of Rajampeta Sri Kodandarami Reddy at Vontimitta.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

ఒంటిమిట్ట బ్రహ్మూత్సవాలలోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

ఒంటిమిట్ట, 2019 ఫిబ్రవరి 06: టిటిడికి అనుబంధంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం బ్రహ్మూెత్సవాలలోపు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయ ఆలయ పరిసరాలు, ఉద్యానవన పనులు, పుష్కరిణి, కల్యాణవేదిక ప్రాంతాలను తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌తో కలిసి బుధవారం ఈవో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించామన్నారు. ఇందులో భాగంగా దాదాపు రూ.60.40 కోట్లతో శాశ్వత కల్యాణవేదిక, మరుగుదొడ్లు తదితర పనులను వేగవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను గత జనవరి 2వ తేది పరిశీలించానన్నారు. అందులో భాగంగా గత నెల తనిఖీలకు, ఈరోజు పరిశీలనలో చాలా పురోగతి ఉందన్నారు. మరోసారి మార్చి 7వ తేది వచ్చి అభివృద్ధి పనులను పరిశీలిస్తానన్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, ఉద్యోగ సిబ్బందిని తెప్పించుకోవాలన్నారు.

ఒంటిమిట్ట బ్రహ్మూెత్సవాలకు ఏప్రిల్‌ 12న అంకురార్పణ జరుగనుందని, ఏప్రిల్‌ 18న శ్రీరాములవారి కల్యాణం, ఏప్రిల్‌ 22వ తేది పుష్పయాగం నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా బ్రహ్మూెత్సవాలలో విచ్చేసే లక్షలాది మంది భక్తులకు అవసరమైన తాత్కలిక ఏర్పాట్లను ఏప్రిల్‌లో ప్రారంభించనున్నట్లు వివరించారు. ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, వేచి ఉండే గదులు, కార్యాలయ భవనం, విశ్రాంతిగృహం పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం శ్రీ కోదండరామప్వామివారి ఆలయం, కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులపై జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీ పి. కోటేశ్వర రావు, రాజంపేట ఆర్డీవో శ్రీ కోదండరామి రెడ్డిల, ఇతర ప్రభుత్వ అధికారులతో సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌ నాయుడు, డిప్యూటీ ఈవో శ్రీ నటేష్‌ బాబు, ఇఇ శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీ రవిశంకర్‌ రెడ్డి, శ్రీ చంద్రశేఖర్‌, ఏఈవో శ్రీ రామరాజు తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.