JEO INSPECTS TRIAL RUN OF SRIVARI THEPPOTSAVAM_ శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్‌ రన్‌ ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో

Tirumala, 22 February 2018: The Tirumala JEO Sri KS Sreenivasa Raju inspected the trial runs of the floats in the Swami Pushkarini in view of the annual Teppotsavam from February 25- March 1.

Speaking to media on the occasion the JEO said floats were fully ready for the celestial event. On the first day, Sita, Lakshman, and Anjaneya will accompany Sri Ramachandra murthy on the float. On Day-2 Sri Krishna Swamy will ride with Rukmini on the float. On the last three days, utsava idols of Sri Malayppaswamy along with consorts Sridevi and Bhudevi will ride on the float.
The floats will go three rounds on first three days, five rounds on Day-4, and 7 rounds on last day.

In view of the Teppotsavam, Vasantotsavam, Sahasra Deepalankara seva scheduled on February 25, and 26 and the arjita Brahmotsavam, Vasantotsavam and Sahasra Deepalankara seva on February 27,28 and March 1have been canceled.

Among others, SE’s Sri Ramachandra Reddy, Sri Ramesh Reddy, and Temple Dy EO Sri Harindranath participated in the theTeppotsavam trial run.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్‌ రన్‌ ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో

తిరుమలలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం స్వామి పుష్కరిణిలో తెప్పల ట్రయల్‌రన్‌ నిర్వహించారు. టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ తెప్పోత్సవాలకు తెప్పలను పూర్తిగా సిద్ధం చేసినట్టు తెలిపారు. తొలిరోజు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై విహరిస్తారని వివరించారు. చివరి మూడురోజులు శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు తెప్పపై భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. మొదటి మూడు రోజులు మూడుసార్లు, 4వ రోజు ఐదుసార్లు, చివరిరోజు ఏడుసార్లు స్వామి, అమ్మవారు పుష్కరిణిలో తెప్పలపై ప్రదక్షిణలు చేస్తారని చెప్పారు.

కాగా, తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవ, ఫిబ్రవరి 27, 28, మార్చి 1వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

తెప్పోత్సవాల ట్రయల్‌రన్‌లో టిటిడి ఎస్‌ఇలు శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ రమేష్‌రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.