JEO REVIEWS SRIVARI SEVA DEPT_ శ్రీవారి సేవా విభాగంపై జెఈవో సమీక్ష

Tirumala, 22 February 2018: Tirumala JEO Sri KS Sreenivasa Raju today said the services of the Srivari Sevaks will be henceforth utilized fully in the six divisions of TTD – Srivari Temple, Anna Prasadam, Vigilance, Kalyana Katta, Health and Reception.

Reviewing the activities of the Srivari Seva Dept. at the Gokulam Rest house today the JEO said all the six key divisions have been directed to give an accurate assessment of their requirements of Srivari Sevaks both during regular days and special festival days for deployment. He advised the officials to firm up strategies and action plans for effective utilization of services of Srivari Sevaks.

The JEO said the final strategy will be evolved by March wherein another review of the Srivari Sevaks deployments in all divisions of the TTD.

Among others FACAO Sri O Balaji, SE’s Sri Ramachandra Reddy, Sri Ramesh Reddy and IT Head Sri Sesha Reddy participated in the review meeting.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీవారి సేవా విభాగంపై జెఈవో సమీక్ష

ఫిబ్రవరి 22, తిరుమల, 2018: శ్రీవారి సేవా విభాగంపై టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు గురువారం తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో గల సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొత్తం ఆరు విభాగాల అధికారులతో సుమారు 4 గంటల పాటు కూలంకషంగా చర్చించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీవారి ఆలయం, అన్నప్రసాదం, విజిలెన్స్‌, కల్యాణకట్ట, ఆరోగ్య, రిసెప్షన్‌ విభాగాలకు అవసరమైన శ్రీవారిసేవకుల సంఖ్య, ప్రస్తుతం ఎంత మందిని కేటాయిస్తున్నారు తదితర అంశాలపై వివరణాత్మకంగా చర్చించారు. సాధారణ రోజులు, రద్దీ రోజులు, విశేష పర్వదినాల సమయంలో పక్కా ప్రణాళికతో మరింత మెరుగ్గా భక్తులకు సేవలందించేలా శ్రీవారి సేవకులకు సేవా విధులు కేటాయించాలని సూచించారు. శ్రీవారి సేవపై మార్చి నెలలో మరోమారు సమావేశం నిర్వహిస్తామన్నారు.

ఈ సమావేశంలో టిటిడి ఎఫ్‌ఏ, సిఏవో శ్రీ ఓ.బాలాజి, ఎస్‌ఇలు శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీరమేష్‌రెడ్డి, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.