TTD ORGANISE SPECIAL DARSHAN FOR PRIVILAGED DEVOTEES_ అక్టోబరు 17, 24వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు,
Tirumala, 11 October 2017: TTD organised special darshan in the Srivari Temple for privileged devotees- aged, challenged and also parents with 5 year old children- on two week days
In the month of October special darshan for aged( above 65 years) and challenged persons 4000 darshan tokens are arranged on October 17 and 24 in three time slots -1000 tokens in 10 AM, 2000 in 2 PM slot and 1000 in 3.00 PM slot
Similarly special darshan tokens for 2000 devotees of 5 year old kids and their parents is organised on October 18 and 25 with 9 AM to 1.30 PM through the Supatham entry.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI
అక్టోబరు 17, 24వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు,
అక్టోబరు 18, 25వ తేదీల్లో 5 ఏళ్లలోపు పిల్లలకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం
తిరుమల, 2017 అక్టోబరు 11: తిరుమలలో ఎక్కువ మంది వృద్ధులకు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు శ్రీవారిదర్శనం కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య దినాలలో వీరికి ప్రత్యేక దర్శనాలను కల్పిస్తోంది.
ఇందులో భాగంగా అక్టోబరు 17, 24వ తేదీలలో వృద్ధులు (65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేలు, మధ్యాహ్నం 3.00 గంటల స్లాట్‌కు వెయ్యి కలిపి మొత్తం 4 వేల టోకెన్లు జారీ చేస్తారు.
5 సంవత్సరాలలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను అక్టోబరు 18, 25వ తేదీలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 2 వేల మంది వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.