JEO INSPECTS VONTIMITTA BRAHMOTSAVAM ARRANGEMENTS _ అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు- టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం

VONTIMITTA, 15 MARCH 2024: As the annual Brahmotsavams in Vontimitta at YSR Kadapa district are scheduled from April 17 to 25 with Ankurarpanam on April 16 and Pushpayagam on March 26, TTD JEO Sri Veerabrahmam along with other officials inspected the ongoing arrangements for the same.

Speaking on the occasion the JEO said, with exactly a month left for the big annual fete which is set to commence with Dwajarohanam on April 17 on the auspicious day of Sri Rama Navami, TTD has begun making arrangements for the same.

He said the state festival of Sri Seeta Rama Kalyanotsavam is scheduled on April 22 and arrangements are underway for the big fest.

Earlier he instructed all the authorities concerned to make the necessary arrangements within the stipulated time keeping in view the huge inception of devotees.

CE Sri Nageswara Rao, DyEOs Sri Natesh Babu, Sri Harikrishna, Smt Prasanthi, Sri Gunabhushan Reddy, Sri Shivaprasad, Deputy Conservator of Forest Sri Srinivasulu, Additional HO Dr Sunil, VGO Sri Bali Reddy, local district officials and others were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు

– ఏప్రిల్ 22న స్వామివారి కల్యాణం

– టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి, 15 మార్చి 2024: వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 16వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం చెప్పారు.

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం ఆయన అధికారులతో కలసి క్షేత్రస్థాయిపరిశీలన, సమీక్ష జరిపారు.

అనంతరం జేఈవో మీడియాతో మాట్లాడుతూ, ఏప్రిల్ 16వ తేదీ సాయంత్రం అంకురార్పణతో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఏప్రిల్ 22వ తేదీ శ్రీ కోదండరాముడి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో ఇప్పటికే సమీక్ష జరిపి అనేక సూచనలు చేశామన్నారు.

బ్రహ్మోత్సవాలకు, స్వామివారి కల్యాణానికి హాజరయ్యే భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. నెలరోజుల ముందు నుంచే టీటీడీ ఈ పనులను ప్రారంభించిందని శ్రీ వీరబ్రహ్మం తెలిపారు. కల్యాణోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయాల్సిన గ్యాలరీలు, వాటిలోకి భక్తులను అనుమతించాల్సిన విధానం, భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ ఏర్పాట్లపై సమీక్ష జరిపామన్నారు. గ్యాలరీల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి మరింత మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కల్యాణ వేదిక అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తులను ఆకట్టుకునేలా నిర్వహిస్తామన్నారు. కల్యాణానికి హాజరయ్యే భక్తులందరికీ ముత్యాల తలంబ్రాలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

టీటీడీ చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ గుణభూషణ రెడ్డి ,డిప్యూటీ ఈవోలు శ్రీ నటేష్ బాబు, శ్రీమతి ప్రశాంతి, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.