OCTOPUS MOCK DRILL AT TIRUMALA SRIVARI TEMPLE _ తిరుమ‌ల శ్రీవారి ఆలయంలో ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్

Tirumala, 15 March 2024: The Octopus force mock drill was conducted at Tirumala Sri Venkateswara Swamy temple on Friday morning.  They showed how to deal with terrorists and how to protect devotees through a mock drill.

Octopus sleuths conducts annual mock drills at various prominent places, temples and government institutions in the state. 

As part of this, under the supervision of Octopus SP Sri Nagendra Babu, a mock drill was conducted in Srivari Temple under the guidance of Additional SP Sri Nagesh Babu. 

TTD Vigilance and security, civil police, reserve police, temple staff and medical staff were thoroughly briefed on how to act in the event of a terrorist attack.

Tirumala VGO Sri Nanda Kishore, Tirumala DSP Sri Srinivasa Achari, AVSOs, Police, Octopus and officers of various departments participated in this mockdrill operation.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తిరుమ‌ల శ్రీవారి ఆలయంలో ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్

తిరుమ‌ల‌, 2024 మార్చి 15: తిరుమ‌ల‌ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌ స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపారు.

ఆక్టోపస్ దళాలు రాష్ట్రంలోని వివిధ ప్రముఖ స్థలాలు, ఆలయాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఏటా మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఆక్టోపస్ ఎస్పీ శ్రీ నాగేంద్ర‌బాబు పర్యవేక్షణలో అద‌న‌పు ఎస్పీ శ్రీ న‌గేష్‌బాబు ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా మ‌రియు భ‌ద్ర‌తా, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు.

ఈ ఆపరేషన్ లో తిరుమల విజివో శ్రీ నంద కిషోర్, తిరుమల డి.ఎస్.పి శ్రీ శ్రీనివాస ఆచారి, ఏవిఎస్ఓలు, పోలీసు, ఆక్టోపస్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.