WIDE PUBLICITY FOR LOCAL TEMPLE ARJITHA SEVAS _ టిటిడి అనుబంధ ఆలయాల ఆర్జితసేవలకు మరింత విస్కృత ప్రచారం – టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 28 October 2017: I Wide publicity should be given to the arjitha seva tickets in local temples of TTD, said Tirupati JEO Sri Pola Bhaskar.

A meeting was held in the meeting hall in TTD Administrative building in Tirupati on Saturday with internal audit officials and HoDs.

Speaking on this occasion the JEO directed the concerned to erect flex boards about Arjita sevas outside the respective temples. He also said a code should be given to identify the puja articles. The JEO said the bahumanam for arjitha seva should be print behind the ticket for the information of the pilgrims.

FACAO Sri Balaji, CAO Sri Raviprasadudu were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టిటిడి అనుబంధ ఆలయాల ఆర్జితసేవలకు మరింత విస్కృత ప్రచారం – టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2017 అక్టోబరు 28: టిటిడి స్థానిక ఆలయాలలో నిర్వహించే ఆర్జితసేవలకు మరింత విస్తృత ప్రచారం చేయాలని, ఆయా ఆలయాల వద్ద భక్తులకు సులభంగా తెలిసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని సమావేశమందిరములో శనివారం అంతర్గత గణాంక అధికారులు, టిటిడి విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి అనుబంధ ఆలయాలలో ఆర్జితసేవ టికెట్ల వెనుక గృహస్తులకు ఇచ్చే బహుమానం వివరాలు ముద్రించేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆలయాలలో వస్తుసామగ్రిని (టి అండ్‌ పిలో) గుర్తించేందుకు వీలుగా కోడ్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఆలయాలకు దాతలు ఇచ్చే విరాళాలు ఆయా ఆలయాల ఉన్నతాధికారులు స్వీకరించి తిరువాభరణం(రిజిష్టర్‌)లో పొందుపర్చాలని సూచించారు. టిటిడి అనుబంధ ఆలయల నిర్వహణకు అవసరమైన చిన్న చిన్న కొనుగొళ్లను ఆయా ఆలయ అధికారులే కొనుగొళ్లు చేసుకునేలా చర్యలు చేపట్టాలని ఎఫ్‌ఎ అండ్‌ సిఎవో శ్రీ బాలాజిని కోరారు.

స్థానిక ఆలయాల స్టోర్లు, పోటులలో వున్న యంత్రాలకు ఇన్స్‌రెన్స్‌ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. టిటిడి గిడ్డంగుల నుండి అనుబంధ ఆలయాలకు వెళ్లె సరకుల రవాణాలో ప్యాకింగ్‌ పటిష్టంగా ఉండలన్నారు. టిటిడి ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విభాగాధిపతులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సిఎవో శ్రీ రవిప్రసాద్‌, అడిట్‌ అధికారులు, అన్ని విభాగాధిపతులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.