JEO RELEASES SRI GT ANNUAL PAVITHROTSAVAM WALL POSTERS_ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల గోడపత్రిక‌లు ఆవిష్కరణ

Tirupati, 28 Aug. 19: The Annual Pavithrotsavam in Sri Govindaraja Swamy Temple in Tirupati will be conducted from September 8 to September 11told Sri P Basanth Kumar, Joint Executive Officer, TTDs.
He has released the posters on Wednesday at his chambers in TTD Adm Bldg, Tirupati. The three days Pavithrotsavams in the famed temple of Sri Govindaraja Swamy commence with Ankurarpanam on September 8. While the other important days include Pavithra Prathista on September 9, Pavithra samarpana on September 10, Purnathi on September 11.

DyEO Smt Varalakshmi, TTD PRO Dr T Ravi were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల గోడపత్రిక‌లు ఆవిష్కరణ

తిరుపతి, 2019 ఆగస్టు 28: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల గోడపత్రికలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బ‌సంత్ కుమార్ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో బుధ‌వారం ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ సెప్టెంబరు 9 నుండి 11వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయని, సెప్టెంబ‌రు 8న అంకురార్పణ నిర్వహిస్తారని తెలిపారు. సెప్టెంబరు 9న పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 10న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, మాడ వీధుల్లోని శ్రీమఠం ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పణ ఉంటుందని వివరించారు. సెప్టెంబరు 11న పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయని, ఈ మూడు రోజుల పాటు స్వామి, అమ్మ‌వార్ల ఉత్స‌వ‌ర్ల‌కు ఉదయం స్నపనతిరుమంజనం ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా ప్ర‌తి రోజు సాయంత్రం స్వామి, అమ్మ‌వార్లు ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- టికెట్‌ కొనుగోలు చేసి ఈ పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చని, గృహస్తులకు ఒక పవిత్రం ప్రసాదంగా అందజేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూప‌రిండెంటెంట్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్ రావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణ‌మూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.