వరలక్ష్మీ వ్రతాన్ని విజయవంతం చేసినందుకు అభినందనలు
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వరలక్ష్మీ వ్రతాన్ని విజయవంతం చేసినందుకు అభినందనలు
తిరుపతి, 2019 ఆగస్టు 28: జరిగిన సమావేశంలో ఆగస్టు 9న తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ అధికారులు, వివిధ విభాగాల సిబ్బందికి జెఈవో అభినందనలు తెలియజేశారు. సెప్టెంబరు 12 నుండి 14వ తేదీ వరకు పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించాలని కోరారు.
ఈ సమావేశంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారులు శ్రీ శ్రీనివాసాచార్యులు, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, ఇఇలు శ్రీ సత్యనారాయణ, శ్రీ మనోహరం, డిఇ శ్రీ చంద్రశేఖర్, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ ఈశ్వరయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.