JEO REVIEW ON DIRECTS FLEXIS TO SPREAD INFO ON DIVYA DARSHAN_ సెప్టెంబర్‌ 27, 30 తేదీల్లో దివ్యదర్శనం టోకెన్లు రద్దు : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు TOKEN CANCELLATIONS

Tirumala25,September 2017; The TTD JEO Sri KS Sreenivasa Raju today urged the officials to put up flexis at all prominent locations in Tirumala and Tirupati to spread awareness about cancellation of Divya Darshan token on September 27 (Garuda Seva Day) and September 30( Peritasi Saturday).

Addressing officials of all departments of TTD reviewing the Brahmotsavam activity the JEO said said flexis should be placed both on the Srivari Mettu and also Alipiri footpaths.He instructed the Broadcasting officials to set right the anomalies in the public address system at the Four mada streets, LED TVs and also the mike systems.

The JEO also briefed the 7 probationary IAS officials who had come to Tirumala on the functioning of the crucial departments like reception, vigilance, IT, Temple darshan, Transport ,Engineering security and Health.

Addressing officials the CVSO Sri Ake Ravikrishna directed the officials to make the Mahadwaram and Bio-metric entrance more vigilant and effective .He also asked the TTD vigilance department to coordinate effectively with local police to provide fool proof security set up for Garudotsavam slated for Septemebr 27, Wednesday.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సెప్టెంబర్‌ 27, 30 తేదీల్లో దివ్యదర్శనం టోకెన్లు రద్దు : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు

సెప్టెంబర్‌ 25, తిరుమల 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్‌ 27, 30 తేదీల్లో కాలినడకన వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు రద్దు చేసినట్లు టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాస రాజు తెలిపారు. బ్రహ్మూెత్సవాల రోజువారి సమీక్షలో భాగంగా రాంబగీచ విశ్రాంతిగృహం ఎదురుగా ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌లో సోమవారం టిటిడి ఉన్నతాధికారులతో జెఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఈ నెల 27వ తేది గరుడసేవ, 30వ తేదీన పెరటాసి రెండో శనివారం కావడంతో దివ్యదర్శనం భక్తులకు టోకెన్లు రద్దు చేశామని తెలిపారు. ఈ విషయాన్ని కాలినడక భక్తులకు తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని, అలిపిరి గాలిగోపురం, శ్రీవారి మెట్టు ప్రాంతాలలో ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గరుడసేవ రోజు భక్తుల ప్రవేశ, నిష్క్రమణ గేట్ల వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. వాహనసేవలు జరిగే సమయంలో ప్రముఖ వక్తలు మాట్లాడే విషయాలు స్పష్టంగా భక్తులకు వినిపించేలా రేడియో, బ్రాడ్‌కాస్టింగ్‌, ఎస్వీబీసీ, ఎలక్ట్రికల్‌ శాఖలు సమన్వయం చేసుకుని సాంకేతిక అంశాలను సరిచేసుకోవాలని సూచించారు. వివిధ విభాగాల ఏర్పాట్లపై శాఖలవారీగా జెఈవో సమీక్ష నిర్వహించారు. ఆలయ అధికారులు, నిఘా, భద్రతా విభాగం, రవాణా, ఆరోగ్య, వైద్య విభాగం, ఇంజనీరింగ్‌, వసతి, అన్నప్రసాద విభాగాల అధికారులు మరింత అప్రమత్తంగా భక్తులకు సేవలు అందించాలని ఆదేశించారు. బ్రహ్మూెత్సవాల ఏర్పాట్లపై శిక్షణలో ఉన్న ఏడుగురు ట్రైనీ ఐఏఎస్‌లకు జెఈవో వివరించారు. బ్రహ్మూెత్సవాలలో భక్తులకు టిటిడి కల్పిస్తున్న సౌకర్యాలను ట్రైనీ ఐఏఎస్‌లు దగ్గరగా చూసేందుకు వచ్చారని తెలియజేశారు.

టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ గరుడసేవ రోజు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిఘా, భద్రతా విభాగం మరిన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందన్నారు. తిరుమలలోని ప్రధాన దారులు, ఆలయ బయోమెట్రిక్‌, మహాద్వారం మార్గాలలో తమ సిబ్బందికి పలు సూచనలు చేశామని తెలిపారు. అనుమానిత వ్యక్తుల వివరాలు తెలిస్తే తమ సిబ్బందికి తెలిజేయాలని కోరారు. గరుడసేవ ఏర్పాట్లపై స్థానిక పోలీసులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు.

ఈ సమావేశంలో ఎస్‌ఈ 2 శ్రీ రామచంద్రారెడ్డి, ట్రాన్స్‌పోర్ట్‌ జీఎం శ్రీ శేషారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, పలువురు సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.