1500 ARTISTS TO PRESENT DEVOTIONAL PAGEANT AT BRAHMOTSAVAM-2017_ 1500 మంది కళాకారులతో బ్రహ్మూెత్సవాల్లో కళాప్రదర్శనలు : హెచ్‌డిపిపి కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి

Tirumala 25,September 2017: In all 1500 artists drawn from all parts of the country are fully engaged in showcasing the devotional pageant of Brahmotsvam-2017 says HDPP secretary, Sri Ramakrishna Reddy.

Speaking to newsmen at the Media center set up by the PR Department to showcase the activities of the TTD for Brahmotsavam Sri Ramakrishna Reddy said that the artists from West Bengal, Kerala, Tamil Nadu, Orissa, Maharashtra, Karnataka and Telangana will display their art skills at Vahana mantapams besides Nada Niranjanam, Asthana Mandapam at Tirumala and Mahati, Annamacharya Kala Mandiram and Ramachandra Pushkarini at Tirupati.

He said the HDPP, Annamacharya project, SV college of Music and Dance, Dasa sahitya project were spearheading the cultural activities which include bhakti music, dance, folk arts display like kolata, tappeta gudnlu, dappu vadyam besides harikatha discourses. Classical dances and commentaries by exponents at Vahana sevas.

Sri Reddy said the TTD has invited award winning artists to perform at all the venues in Tirumala and Tirupati. The focus of the cultural bonanza is to present the lores of Lord Venkateswara and sanatana Hinduism. Effort is to give a devotional elixir to devotees so that they go back with fond memories of Brahmotsavams.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

1500 మంది కళాకారులతో బ్రహ్మూెత్సవాల్లో కళాప్రదర్శనలు : హెచ్‌డిపిపి కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి

సెప్టెంబర్‌ 25, తిరుమల 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల్లో మొత్తం 1500 మంది కళాకారులతో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు బ్రహ్మూెత్సవాల్లో ప్రదర్శనలిస్తున్నట్టు తెలిపారు. వాహనసేవలతోపాటు తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపం, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలో ధార్మిక, సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌తో పాటు అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియజేశారు. ఇందులో భక్తి సంగీతం, భజనలు, కోలాటాలు, తప్పెటగుండ్లు, పిల్లనగ్రోవి నృత్యాలు, డప్పు వాయిద్యం తదితర కళాప్రదర్శనలు ఉన్నాయని వివరించారు. నాదనీరాజనం వేదికపై ప్రముఖ కళాకారుల నామసంకీర్తనం, గాత్ర, నృత్య కార్యక్రమాలు జరుగుతున్నాయని, వాహనసేవల్లో వ్యాఖ్యానం అందించేందుకు ప్రముఖ పండితులను ఏర్పాటుచేశామని చెప్పారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.