JEO REVIEW ON ENGINEERING WORKS HELD_ భ‌క్తుల‌కు మ‌రింత మెరుగైన సౌక‌ర్యాలు – తిరుమ‌ల‌లో అభివృద్ధి ప‌నుల‌పై జెఈవో స‌మీక్ష‌

Tirumala, 10 Jan. 19: Tirumala JEO Sri KS Sreenivasa Raju on Thursday reviewed on the progress of ongoing engineering works at Annamaiah Bhavan in Tirumala.

Later speaking to media persons he said, the engineering works are taken up considering two components, one for the festivities and another on permanent basis.

While the construction of toilets, barricades, queue lines at different places facilitated pilgrims to have hassle free darshanam during twin brahmotsavams and Vaikuntha Ekadasi last year, the other works have been taken up on a permanent basis, he added.

Today we discussed in length about the major civil works which are under progress including the 3rd Phase Outer Ring Road, queue line in Narayanagiri Gardens at Rs.23crores, Queue line from Alwar Tank Rest House to MBC circle, PAC 5 at an estimated cost of Rs.70crores, beautification works of Pushkarini to enhance religious fervour, etc.

He said all the works will be completed within the designated time.

CE Sri Chandra Sekhar Reddy, SEs Sri Ramachandra Reddy, Sri Ramesh Reddy, EEs, DyEEs were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

భ‌క్తుల‌కు మ‌రింత మెరుగైన సౌక‌ర్యాలు – తిరుమ‌ల‌లో అభివృద్ధి ప‌నుల‌పై జెఈవో స‌మీక్ష‌

తిరుమల, 2019 జనవరి 10: తిరుమలలో శ్రీవారి ద‌ర్శ‌నార్థం విచ్చేసే ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు మ‌రింత మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు టిటిడి ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వ‌ర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు గురువారం ఉద‌యం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఇందులో సివిల్ ఇంజినీరింగ్ ప‌నుల‌పై స‌మీక్ష చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ రోజు రోజుకూ పెరుగుతున్న భ‌క్తుల సంఖ్య‌కు అనుగుణంగా వ‌స‌తులు క‌ల్పించేందుకు టిటిడి ఇంజినీరింగ్ విభాగం ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున‌ ప‌నులు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలైన ర‌థ‌స‌ప్త‌మి, వైకుంఠ ఏకాద‌శి, గ‌రుడ‌సేవల‌కు తాత్కాలిక ఏర్పాట్లు, శాశ్వ‌త ప్రాతిపాదిక‌న ప‌నులు చేస్తున్నామ‌న్నారు.

ఇందులో భాగంగా 3వ విడ‌త రింగ్ రోడ్డు ప‌నులను త్వ‌రిత గ‌తిన పూర్తి చేసి భ‌క్తుల‌కు అందుబాటులోనికి తీసుకురావాల‌న్నారు. అదేవిధంగా రూ.23 కోట్ల‌తో నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌ వ‌నాల‌లో క్యూ లైన్ల నిర్మాణం, రూ.10 కోట్ల‌తో ఆళ్వారు ట్యాంక్ అతిథి భ‌వ‌నం నుండి ఎమ్‌బిసి కూడ‌లి వ‌ర‌కు రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌లో నాణ్య‌త‌లో రాజీ లేకుండా, నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిలో పూర్తి చేయ‌ల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. భ‌క్తుల‌ సౌక‌ర్యార్థం రూ.70 కోట్ల‌తో పిఎసి-5ను నిర్మించేందుకు టెండ‌ర్లు పిలిచి త్వ‌ర‌లో ప‌నులు ప్రారంభించ‌నున్న‌ట్లు వివ‌రించారు.

ఇటీవ‌ల ఆల‌య మాడ వీధుల్లోని గ్యాల‌రీలు, నారాయ‌ణ‌గిరి ఉద్యాన వ‌నాల‌లో రూ.26 కోట్ల‌తో నిర్మించిన మ‌రుగుదొడ్లు భ‌క్తుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌తున్నాయ‌న్నారు. ప్ర‌స్తుతం పిఏసి-2లోని వంట‌శాల‌ను విస్త‌రించేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ట్లు తెలిపారు.

భ‌క్తుల‌కు మ‌రింత ఆహ్లాద‌క‌ర, ఆధ్యాత్మిక అనుభూతి క‌ల్పించేందుకు వీలుగా ఆల‌య నాలుగు మాడ వీధులు, పుష్క‌రిణి చుట్టూ మ‌రింత సుంద‌రంగా రూపొందించేందుకు త్వ‌ర‌లో ప‌నులు ప్రారంభిస్తామ‌న్నారు. భ‌క్తుల‌కు మ‌రింత ఉన్న‌త‌మైన సేవ‌లందించేందుకు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు రూపొందించి అమ‌లు చేస్తున్న‌ట్లు వివ‌రించారు.

ఈ సమావేశంలో టిటిడి సిఇ శ్రీ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, ఎస్‌ఇలు శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఇఇలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.