COMPLETER MASTER PLAN WORKS AS SCHEDULED- JEO_ తిరుచానూరులో మాస్టర్ ప్లాన్ పనులను సకాలంలో పూర్తి చేయాలి : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
Tirupati, 20 Jun. 19: TTD Joint Executive Officer in Tirupati Sri B Lakshmi Kantham has Instructed officials to speed up and complete development works of Tiruchanoor temple like new Ratham, Surya Prabha vahanam and new Ratham at Appalayagunta temple as per master plan schedule.
Speaking after a review meeting at TTD administrative building on Thursday morning the JEO advised officials to upload the video of Srivari temple works on the TTD website. He wanted an online facility for donations to the Srivani Trust (Sri Venkateswara Alaya Nirman Trust).
He also wanted a suitable selection of a location to store one TMC of water in Tirumala to resolve the water crisis in hill shrine. He urged them to pace up construction of Govinda Mala electrical installations on all TTD roads.
The JEO asked officials to increase circulation of TTD magazine Saptagiri and also enhance the functioning of the TTD call centre as per global standards.
TTD Chief Engineer Sri Chandrasekhar Reddy, SEs Sri Ramesh Reddy, Sri Venkateswarlu, DyEO Smt Gautami, Estate officer Sri Vijaysaradhi, DyEO Smt Varalakshmi, Sri Damodaram, Sri Ramamurthy Reddy, Smt Lakshmi Narasamma, Sri EC Sridhar and others participated.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుచానూరులో మాస్టర్ ప్లాన్ పనులను సకాలంలో పూర్తి చేయాలి : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
తిరుపతి, 2019 జూన్ 20: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగంగా రూపొందించిన మాస్టర్‌ప్లాన్ పనులను సకాలంలో పూర్తి చేయాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. అదేవిధంగా, తిరుచానూరులో అమ్మవారికి నూతన రథం, సూర్యప్రభ వాహనం, అప్పలాయగుంటలో నూతన రథం తయారీ పనులను వేగవంతం చేయాలన్నారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో జెఈవో గురువారం వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన వీడియోను టిటిడి వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. పలు ప్రాంతాల్లో శ్రీవారి దివ్యక్షేత్రాల నిర్మాణానికి ఉద్దేశించిన శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు(శ్రీవాణి)కు భక్తులు ఆన్‌లైన్‌లో విరాళాలు అందించే సౌకర్యం కల్పించామన్నారు. తిరుమలకు నీటి ఇబ్బందులు తొలగించేందుకు ఒక టిఎంసి నీటిని నిల్వ ఉంచేలా స్థల పరిశీలన చేపట్టాలని చీఫ్ ఇంజినీర్‌ను ఆదేశించారు. టిటిడి రోడ్లలో విద్యుత్ వెలుగుల్లో శంఖుచక్రాలు కనిపించేలా ఏర్పాటుచేస్తున్న గోవిందమాల పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సప్తగిరి మాసపత్రిక చందాదారుల సంఖ్యను మరింత పెంచాలని సూచించారు. భక్తులకు మరింత మెరుగ్గా సమాచారం అందించేలా టిటిడి కాల్‌సెంటర్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేపట్టామన్నారు.
ఈ సమావేశంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డిలు, ఎస్ఇలు శ్రీ రమేష్‌రెడ్డి, శ్రీ రాములు, శ్రీ వేంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవో జనరల్ శ్రీమతి గౌతమి, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ విజయసారధి, డెప్యూటీ ఈవోలు శ్రీమతి వరలక్ష్మీ, శ్రీ దామోదరం, శ్రీ రామ్మూర్తిరెడ్డి, శ్రీమతి లక్ష్మీనరసమ్మ, శ్రీ ఇసి.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.