JEO REVIEWS GARUDA SEVA ARRANGEMENTS_ గరుడసేవ ఏర్పాట్లపై జెఈవో సమీక్ష

Tirumala, 26 September 2017: Tirumala JEO Sri KS Sreenivasa Raju today directed the officials to take every precaution to ensure that the common devotees were not put to hardships on the Garuda seva day tomorrow.

During his daily review at the police control room near Rambagicha rest house, the JEO said that tomorrow water and butter milk packets, besides food, tiffin and milk for kids should be adequately supplied not only at the mada streets but also in the Food counters located all over Tirumala. He directed officials to not leave their designated locations and the vigilance and police should coordinate their plans in view of heavy rush of devotees.

Drinking water should be made available even in the corridors of Vaikuntam queue complex. All in charges of the eight sectors in Tirumala should also coordinate their action plans, He also advised.

Among others SE-2 Sri Ramachandra Reddy, Transport GM Sri Sesha Reddy, DY EOs Sri Kodandarama Rao, Sri Venugopal, Sri Harindranath, Health officer Dr Shermista, Estate officer Smt Krishna Bharati and other senior officials participated in the review meeting.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

గరుడసేవ ఏర్పాట్లపై జెఈవో సమీక్ష

సెప్టెంబర్‌ 26, తిరుమల 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలలో భాగంగా సెప్టెంబర్‌ 27వ తేదీన జరుగనున్న గరుడసేవ రోజు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. బ్రహ్మూెత్సవాల రోజువారి సమీక్షలో భాగంగా రాంభగీచా విశ్రాంతిగృహం ఎదురుగా ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌లో మంగళవారం టిటిడి ఉన్నతాధికారులతో జెఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ గరుడసేవ రోజున భక్తులకు అన్నప్రసాద కౌంటర్లతో పాటు, గ్యాలరీల్లో, భక్తులు రద్దీ ఉండే ప్రాంతాలలో అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు విరివిగా పంపిణీ చేయాలని అన్నప్రసాదం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గరుడసేవ రోజున టిటిడి ఉన్నతాధికారులు ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఎలా భక్తులకు సేవలందించాలనే విషయాలపై జెఈవో పలు సూచనలు చేశారు. భక్తుల రద్దీ మరింత అధికమయ్యే అవకాశం ఉండటంతో మాడ వీధులు, గ్యాలరీలు తదితర ప్రాంతాలలో టిటిడి భద్రతా అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. భక్తుల ప్రవేశ, నిష్క్రమణ గేట్ల వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ కారిడార్లలో భక్తులకు జలప్రసాదాలు అందించాలన్నారు. ఎనిమిది సెక్టార్లలో ఇన్‌ఛార్జీలుగా ఉన్న టిటిడి ఉన్నతాధికారులు ఆయా సెక్టార్లలో మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించి, ఎదైనా సమస్య తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. బ్రహ్మూెత్సవాల ఏర్పాట్లను లోతుగా పరిశీలించాలని శిక్షణలో ఉన్న ఏడుగురు ట్రైనీ ఐఏఎస్‌లకు జెఈవో కోరారు.

ఈ సమావేశంలో ఎస్‌ఈ 2 శ్రీ రామచంద్రారెడ్డి, ట్రాన్స్‌పోర్ట్‌ జీఎం శ్రీ శేషారెడ్డి, డిప్యూటీ ఈవోలు శ్రీ కోదండరామారావు, శ్రీమతి గౌతమి, శ్రీమతి ఝాన్సీ, శ్రీ వేణుగోపాల్‌, శ్రీ హరీంద్రనాథ్‌, ఆరోగ్య శాఖాధికారి డా|| శర్మిష్ట, ఎస్టేట్‌ అధికారి శ్రీమతి కృష్ణభారతి, పలువురు సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.