BODY WORN CAMERAS TO VIGIL GARUDA SEVA-CVSO_ బాడి వోర్న్‌ కెమెరాల ద్వారా భక్తుల భద్రత పర్యవేక్షణ : టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ

BRAHMOTSAVAM PARKING TRACKER APP TO LOCATE CAR PARKING SPACE

Tirumala, 26 September 2017: Technology has been fully adopted for crowd management and Body Worn Cameras will be used to curtail the movement of anti-social elements, said the TTD CVSO Sri Ake Ravikrishna.

Speaking to reporters at the Media Center in Tirumala on Tuesday, he said about 25 Body Worn Cameras have been purchased and they will be utilized in the areas where there is huge congregation of crowd and possibility of movement of anti-social elements. “We are co-coordinating with the police on traffic regulation for Garuda Seva. A special parking app, “Brahmotsavam Parking Tracker” app has been conceived by the Tirupati police to monitor and regulate parking and traffic on ghat roads during the Garuda seva day. Devotees could locate empty parking space at Tirumala by downloading this app.”, he said.

He said five entry and exit points from mada streets were fully monitored through the Common Command Centre and about 400 home guards, 40 senior police officials have been deployed exclusively for Garuda Seva. Parking lots have been geared up to receive 7000 cars and contingency plans for 2500 more have been made at Alipiri in 32 acre sprawling area at Devalok”, the CVSO maintained.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

బాడి వోర్న్‌ కెమెరాల ద్వారా భక్తుల భద్రత పర్యవేక్షణ : టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ

సెప్టెంబర్‌ 26, తిరుమల 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల్లో భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో బాడి వోర్న్‌ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నామని టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ తెలిపారు. మొత్తం 25 కెమెరాలు తెప్పించామని, భద్రతా సిబ్బంది వీటిని చొక్కాకు తగిలించుకుని రద్దీ ఉన్న ప్రాంతాల్లో సంచరిస్తూ అపరిచిత వ్యక్తులను గుర్తిస్తారని వివరించారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో మంగళవారం సివిఎస్‌వో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సివిఎస్‌వో మాట్లాడుతూ శ్రీవారికి, భక్తుల మధ్య వారధిగా పనిచేసి చక్కటి సేవలందించేలా భద్రతా సిబ్బందికి సూచనలిచ్చామని తెలిపారు. మాడవీధులు, గ్యాలరీల్లో ఇప్పటికే పలుమార్లు తనిఖీలు నిర్వహించామని, మొత్తం ఐదు ప్రాంతాల్లో ప్రవేశమార్గాలను ఏర్పాటుచేశామని వివరించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి సిసిటివిల ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లోని భద్రతను పర్యవేక్షిస్తామన్నారు. గరుడసేవ నాడు 40 మంది పోలీసు అధికారులు, 400 మంది హోంగార్డులు అదనంగా విధులు నిర్వహిస్తారని తెలిపారు. గరుడసేవనాడు 7 వేల వాహనాలను తిరుమలకు అనుమతిస్తామని, ఆ తరువాత వచ్చే వాహనాలకు తిరుపతిలోని అలిపిరి వద్ద దేవలోక్‌ ప్రాంగణంలో పార్కింగ్‌ ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఖాళీ పార్కింగ్‌ ప్రదేశాలను గుర్తించేందుకు తిరుపతి పోలీసులు బ్రహ్మూెత్సవం పార్కింగ్‌ ట్రాకర్‌ యాప్‌ను రూపొందించారని తెలిపారు.

మీడియా సమావేశంలో టిటిడి పిఆర్‌వో డా|| టి.రవి, ఎపిఆర్వో కుమారి పి.నీలిమ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.