JEO REVIEWS ON REST HOUSES MANAGEMENT_ తిరుమలలోని అతిథిగృహాల నిర్వహణపై జె.ఈ.ఓ సమీక్ష

Tirumala, 10 November, 17: Tirumala JEO Sri KS Sreenivasa Raju on Friday reviewed with engineering officials on the management of various rest houses in Tirumala.

The review meeting was conducted at Annamaiah Bhavan. Speaking on this occasion he said, since TTD is going to introduce helpline numbers soon for FMS all the pending civil, electrical and FMS related works should complete.

Earlier he reviewed over the status of works in progress in different rest houses on the report submitted by engineering officials who carried out random inspections during last month.

SE II Sri Ramachandra Reddy, DyEO Smt Jhansi, Health Officer Dr Sermista, OSD Sri Lakshminarayana, EEs, DE, AEs were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలోని అతిథిగృహాల నిర్వహణపై జె.ఈ.ఓ సమీక్ష

నవంబరు 10, తిరుమల 2017: తిరుమలలోని వివిధ అతిథిగృహాల నిర్వహణపై తిరుమల జె.ఈ.ఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు శుక్రవారంనాడు అన్నమయ్య భవనంలో ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇందులో భాగంగా ఆయన గతనెల 10వ తారీఖున ఇంజనీరింగ్‌ అధికారుల బృందంతో తిరుమలలోని వివిధ అతిథి గృహాలలో నిర్వహించిన తణిఖీలకు సంబంధించిన నివేదికపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో తిరుమలలో కాటేజీలకు సంబంధించిన హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో భక్తులే నేరుగా ఆ నెంబరుకు ఫోన్‌చేసి సమస్యను తెలిపే సౌకర్యాన్ని తి.తి.దే ప్రవేశపెట్టనుందని తెలిపారు. అంతకు మునుపే విడిదిగృహాల్లో చేయవలసిన సివిల్‌, ఏలక్ట్రికల్‌, ఎప్‌.యం.ఎస్‌కు సంబంధించిన సమస్యలు ఉంటే వాటిని వెనువెంటనే పరిష్కరించాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో ఎస్‌.ఇ.2 శ్రీ రామచంద్రారెడ్డి, ఆరోగ్యశాఖాధికారిణి డా|| షర్మిష్ట, ఈ.ఈలు శ్రీ ప్రసాద్‌, శ్రీ తోటవెంకటేశ్వర్లు, శ్రీ శివరామకృష్ణ, డిప్యూటి.ఈ.ఓ శ్రీమతి ఝాన్సీ, డి.ఈ ఎలక్ట్రికల్స్‌ శ్రీమతి సరస్వతి, ఓ.ఎస్‌.డి శ్రీ లక్ష్మినారాయణ యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.