JEO REVIEWS SSD WORKS_ సర్వదర్శనం కౌంటర్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి : తిరుమల జెఈఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 25 November 2017 Tirumala JEO Sri KS Sreenivasa Raju reviewed on progress of Slotwise Sarva Darshan (SSD)Works with various departments.

The review meeting was held at Annamaiah Bhavan in Tirumala on Saturday with Engineering, Security and IT wings about status of first phase of works. The JEO said in this phase 107 counters will be coming up in 14 various locations in Tirumala. “TTD EO Sri Anil Kumar Singhal may inspect the works on December 1”, he added.

SE II Sri Ramachandra Reddy, SE Electrical Sri Venkateswaulu, GM Sri Sesha Reddy, DyEOs Sri Kodanda Rama Rao, Sri Venugopal, VGO Sri Ravindra Reddy and others were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

సర్వదర్శనం కౌంటర్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి : తిరుమల జెఈఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

నవంబరు 25, తిరుమల, 2017: డిసెంబరు రెండో వారం నుంచి ప్రయోగాత్మకంగా సర్వదర్శనం భక్తులకు టైమ్‌స్లాట్‌ విధానాన్ని అమలుచేసేందుకు తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తున్న కౌంటర్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం సాయంత్రం సర్వదర్శనం కౌంటర్ల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ మొదటి విడతగా తిరుమలలోని 14 ప్రాంతాల్లో 107 కౌంటర్లు ఏర్పాటుచేస్తున్నామని, త్వరలో వీటిని ప్రారంభిస్తామని తెలిపారు. డిసెంబరు 1న డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఈ కౌంటర్లను పరిశీలిస్తారని చెప్పారు. భక్తులు అధిక సమయం క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండా చూసేందుకు ప్రతిష్టాత్మకంగా టైంస్లాట్‌ విధానాన్ని ప్రవేశపడుతున్నామని, అధికారులు ప్రత్యేకశ్రద్ధ వహించి సకాలంలో కౌంటర్ల పనులను పూర్తి చేయాలని సూచించారు. ఈ కౌంటర్లలో కావాల్సిన కంప్యూటర్లు, ఇతర మౌలిక సదుపాయాలను వెంటనే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌, ఇడిపి, అన్నప్రసాదం తదితర విభాగాలు ఏమాత్రం ఆలస్యం కాకుండా పనులు పూర్తి చేయాలన్నారు.

అనంతరం పలు ప్రాంతాల్లో ఏర్పాటవుతున్న సర్వదర్శనం కౌంటర్లను జెఈవో పరిశీలించి అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ కోదండరామారావు, శ్రీ వేణుగోపాల్‌ ఇతర ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.