TWO CDs OF ANNAMAYYA KEERTHANS RELEASED_ ‘అన్నమయ్య జీవుని కొలువు, అన్నమయ్య గీతాసారం’ సంకీర్తనల ఆవిష్కరణ

Tirupati, 25 November 2017: On the auspicious ocassion of Srivari birth star -Sravana- today two unique CDs of Annamayya Sankeertans were released by Sri Muniratnam Reddy, OSD of the SV Recording Project.

The CDs titled Annamayya Jevuni Koluvu and Annamayya Geeta saram were released at the Annamayya Kalamandiram ,Tirupati. The OSD felicitated Sri B Raghunath with Srivari prasadam and Shaluva after he enthralled the audience by singing the sankeertans on the ocassion.

The Sankeertans have also been uploaded on the TTD website and the same may be freely downloaded by the devotes.

Among others OSD of MTV project Acharya K J Krishnamurthy and other officials participated in the event.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

‘అన్నమయ్య జీవుని కొలువు, అన్నమయ్య గీతాసారం’ సంకీర్తనల ఆవిష్కరణ

తిరుపతి, 2017 నవంబరు 25: శ్రీవారు జన్మించిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని శనివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ”అన్నమయ్య జీవునికొలువు”, ”అన్నమయ్య గీతాసారం” సంకీర్తనలను ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి ఆవిష్కరించారు.

టిటిడి ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ సంకీర్తనలను రికార్డు చేశారు. ”అన్నమయ్య జీవునికొలువు” సంకీర్తనలను శ్రీ బి.రఘునాథ్‌ స్వరపరిచి గానం చేశారు. ”అన్నమయ్య గీతాసారం” సంకీర్తనలను శ్రీ పిఆర్‌.రామనాథన్‌ స్వరపరిచి ఆలపించారు. ఈ సందర్భంగా కళాకారులను శాలువతో సన్మానించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం కళాకారులు ఈ సంకీర్తనలను పాడి వినిపించారు.

ఈ సంకీర్తనలను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడమైనది. భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.