JEO REVIEWS V DAY ARRANGEMENTS IN SKVST _ శ్రీ‌నివాసమంగాపురంలో వైకుంఠ ఏకాద‌శికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం

TIRUPATI, 03 JANUARY 2022: Elaborate arrangements are going on In connection with Vaikunta Ekadasi and Vaikunta Dwadasi on January 13 and 14 respectively in Srinivasa Mangapuram temple said, TTD JEO Sri Veerabrahmam.

A review meeting was held with the officials in the Conference Hall in TTD Administrative Building in Tirupati on Monday.

Speaking on the occasion the JEO said, in the second review meeting on V day arrangements, the setting up of luggage and cell phone deposit counters has been discussed in length as the devotee rush is being anticipated on these two days.

He also said other arrangements including queue line management, Deployment of security, Srivari Sevaks, parking, sale of laddus, 2022 Calendars and Diaries of TTD etc. have also been reviewed with the officials concerned.

DyEO Smt Shanti, DE Smt Saraswati, AEO Dhananjeyulu and other officials were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPAT

శ్రీ‌నివాసమంగాపురంలో వైకుంఠ ఏకాద‌శికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం

తిరుప‌తి, 2022 జ‌న‌వ‌రి 03: శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 13న‌ వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా భ‌క్తుల‌కు విస్తృతంగా ఏర్పాట్లు చేప‌డుతున్నామ‌ని టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం తెలిపారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం స‌మావేశ మందిరంలో సోమ‌వారం వైకుంఠ ఏకాద‌శి ఏర్పాట్ల‌పై అధికారులతో స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా స్వామివారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తుల‌కు సౌక‌ర్యవంతంగా ఉండేలా క్యూలైన్లు, ల‌గేజి, సెల్‌ఫోన్ డిపాజిట్ కౌంట‌ర్లు ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. భ‌క్తుల‌కు విక్ర‌యించేందుకు తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూలు, నూత‌న సంవ‌త్స‌రం డైరీలు, క్యాలెండ‌ర్లు అందుబాటులో ఉంచాల‌న్నారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌, వాహ‌నాల కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేప‌ట్టాల‌న్నారు. భ‌క్తుల‌కు త‌గిన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని, శ్రీ‌వారి సేవ‌కుల‌తో సేవ‌లు అందించాల‌ని సూచించారు. భ‌క్తులు కోవిడ్ నిబంధ‌న‌లు పాటించి స్వామివారి ద‌ర్శ‌నం చేసుకునేలా చూడాల‌న్నారు. ఆర్టీసీ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని తిరుప‌తి, చంద్ర‌గిరి, ఇత‌ర ప్రాంతాల నుండి శ్రీ‌నివాస‌మంగాపురానికి బ‌స్సులు న‌డిపేలా ఏర్పాట్లు చేప‌ట్టాల‌న్నారు. జ‌న‌వ‌రి 11వ తేదీలోపు ఇంజినీరింగ్ ప‌నులు పూర్తి చేయాల‌ని ఆదేశించారు.

ఈ స‌మావేశంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, ఇఇలు శ్రీ ముర‌ళి, శ్రీ మ‌నోహ‌ర్‌, అద‌న‌పు ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ సునీల్‌, డిఇ(ఎల‌క్ట్రిక‌ల్‌) శ్రీ‌మ‌తి స‌ర‌స్వ‌తి పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.