JEO REVIEWS WITH IT EXPERTS_ ఐటి అధికారులతో జెఈవో సమీక్ష

Tirumala, 11 September 2017: To enhance the services to pilgrims in a better and speedy way with transparency, Tirumala JEO Sri KS Sreenivasa Raju convened a review meeting with IT experts.

The meeting was held at Annamaiah Bhavan in Tirumala with IT wing of TTD and TCS team.

The JEO reviewed on the improvements required in the Cottage Allotment Syatem(CAS) application. He said reviewing the advanced booking of rooms in the past ten days and for the next 45 days, the ceiling limit of rooms under ARP in Nandakam Rest House is fixed as150 rooms, keeping in view the benefit of pilgrims.

Later the JEO also reviewed on the improvements to be made in the soft application meant for Kalyanakatta to enhance transparency.

IT wing chief Sri Sesha Reddy, Chief Information Officer Sri Sudhakar, DyEOs Sri Harindranath, Sri Venkataiah, OSD Sri Lakshmi Narayana and other IT, TCS, Reception officials were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

ఐటి అధికారులతో జెఈవో సమీక్ష

సెప్టెంబర్‌ 11, తిరుమల, 2017: భక్తులకు మరింత వేగంగా, మెరుగ్గా, పారదర్శకంగా సేలందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు టిటిడి ఐటి, టిసిఎస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం ఈ సమావేశం జరిగింది.

కాటేజి అలాట్‌మెంట్‌ సిస్టమ్‌ అప్లికేషన్‌ను మరింత మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. గదుల అడ్వాన్స్‌ బుకింగ్‌కు సంబంధించి గత పది రోజులతోపాటు రానున్న 45 రోజుల సమాచారాన్ని సమీక్షించిన అనంతరం భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని నందకం విశ్రాంతి గృహంలో గదుల ఎఆర్‌పి సీలింగ్‌ను 150కి పరిమితం చేయాలని సూచించారు. కల్యాణకట్టలో పారదర్శకత పెంచేందుకు రూపొందిస్తున్న సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌పై చర్చించారు.

ఈ సమావేశంలో ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారి శ్రీసుధాకర్‌, డెప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్‌, శ్రీ వెంకటయ్య, ఓఎస్‌డి శ్రీ లక్ష్మీ నారాయణ యాదవ్‌, ఇడిపి మేనేజర్‌ శ్రీ భాస్కర్‌, ఓఎస్‌డి శ్రీ బాలాజిప్రసాద్‌, టిసిఎస్‌ అధికారులు శ్రీ భీమశేఖర్‌, శ్రీ సత్య ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.