PAVITROTSAVAMS IN RISHIKESH FROM OCT 1-3_ అక్టోబరు 1 నుంచి 3వ తేదీ వరకు రిషికేశ్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
Tirupati, 11 September 2017: The annual three day pavitrotsavams in Sri Venkateswara Swamy temple at Andhrashramam in Rishikesh will be observed from October 1 to 3 with Ankurarpanam on September 30.
On first day Akalmasha Homam, Pavitra Pratishta, second day Pavitra Samarpana and third day Purnahuti and Veedhi Utsavam will be observed.
Devotees who are willing to take part in this fete can pay Rs.500 per ticket on which two persons will be allowed.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
అక్టోబరు 1 నుంచి 3వ తేదీ వరకు రిషికేశ్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
సెప్టెంబర్ 11, తిరుపతి, 2017: టిటిడి పరిధిలోని రిషికేష్ ఆంధ్ర ఆశ్రమంలో గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 1 నుంచి 3వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.
ఆలయంలో సంవత్సరం పొడవునా జరిగిన పలు క్రతువుల్లో తెలిసీ తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల వల్ల ఒక సంవత్సరంపాటు యజ్ఞం చేసినంత ఫలితం కలుగుతుందని అర్చకులు చెబుతున్నారు.
సెప్టెంబరు 30న అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. అక్టోబరు 1న అకల్మషహోమం, పవిత్ర ప్రతిష్ఠ, అక్టోబరు 2న పవిత్ర సమర్పణ, వీధి ఉత్సవం నిర్వహిస్తారు. అక్టోబరు 3న పూర్ణాహుతి, హోమం, వీధి ఉత్సవం జరుగనున్నాయి. రూ.500/- చెల్లించి గ హస్తులు(ఇద్దరు) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.