JEO TEAM VISITS AMBATTUR SWEET FACTORY_ చెన్నైలో బూందీ యంత్రాన్ని పరిశీలించిన జెఈవో

Tirumala, 22 November 2017: A team of TTD senior officials from engineering and potu wings lead by Tirumala JEO Sri KS Sreenivasa Raju paved a visit Chennai on Wednesday to study the working of boondi making machine in the famous Adayar Ananda Bhavan Sweets Factory at Ambattur.

The factory MD Sri KT Srinivasa Raja welcomed Tirumala JEO Sri KS Sreenivasa Raju and other officers and the functioning of boondi and thermo fluid machines in detail.

He said, the boondi machinery are the most advanced, economic, qualitative and quantitative.

Along with JEO, CE Sri Chandra Sekhar Reddy, FACAO Sri Balaji, SE II Sri Ramachandra Reddy, SE Electrical Sri Venkateswarulu, AEO Potu Sri Ashok and other officers were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

చెన్నైలో బూందీ యంత్రాన్ని పరిశీలించిన జెఈవో

తిరుమల, 2017 నవంబరు 22: టిటిడి అవసరాల కోసం చెన్నైలో అత్యాధునిక బూందీ తయారీ యంత్రాన్ని బుధవారం తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పరిశీలించారు.

జెఈవో ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌, పోటు అధికారుల బృందం చెన్నైలోని అంబత్తూరు ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో గల ప్రఖ్యాత అడయార్‌ ఆనందభవన్‌ స్వీట్‌ ఫ్యాక్టరీని సందర్శించింది. ఫ్యాక్టరీ ఎండి శ్రీ కెటి.శ్రీనివాసరాజ టిటిడి అధికారులకు సాదరంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఈ యంత్రం ద్వారా తక్కువ ఖర్చులో మరింత వేగంగా, ఎక్కువ మొత్తంలో పరిశుభ్రంగా బూందీని తయారుచేసేందుకు వీలవుతుందని తెలిపారు. దీంతోపాటు థెర్మోఫ్లూయిడ్‌ యంత్రాలను కూడా పరిశీలించారు.

జెఈవో వెంట టిటిడి ఎఫ్‌ఏ, సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇలు శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ వేంకటేశ్వర్లు, పోటు ఏఈవో శ్రీ అశోక్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.