JEO TIRUMALA ADDRESSES DEPLOYED STAFFS_ వైకుంఠ ఏకాద‌శికి విచ్చేసే భ‌క్తుల‌కు మెరుగైన సేవ‌లందించాలి : తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు

Tirupati, 14 December 2018: Tirumala JEO Sri KS Sreenivasa Raju called upon the employees of TTD who are deputed for Vaikuntha Ekadasi duty to put on cent per cent efforts to serve the pilgrims during the ensuing Vaikuntha Ekadasi and Dwadasi festival days.

The training programme to deputation employees was held in SVETA building in Tirupati on Friday evening. Speaking on this occasion, the JEO said, during the Brahmotsava Garuda Seva also, nearly 400 staffs have been deployed at various points to monitor the services that are being provided to pilgrims which has given fruitful results. Similarly, we are deploying the staffs at different points in VQC, Narayanagiri queue lines, Mada Streets, Kalyana Vedika etc. to ensure that all facilities reach the pilgrims on time.

CE Sri Chandra Sekhar Reddy, FACAO Sri Balaji, GM Sri Sesha Reddy, CAO Sri Sesha Sailendra, DyEO Services Smt Kasturi, Health Officer Dr Sermista, Annaprasadam Special Officer Sri Venugopal and others were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైకుంఠ ఏకాద‌శికి విచ్చేసే భ‌క్తుల‌కు మెరుగైన సేవ‌లందించాలి : తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు

డిసెంబ‌రు 14, తిరుమల 2018: తిరుమ‌ల‌లో డిసెంబ‌రు 18న వైకుంఠ ఏకాద‌శి, డిసెంబ‌రు 19న ద్వాద‌శి ప‌ర్వ‌దినాల‌కు విశేషంగా విచ్చేసే భ‌క్తుల‌కు ఆయా విభాగాల్లోని సిబ్బంది మెరుగైన సేవ‌లు అందించాల‌ని టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు కోరారు. తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నంలో శుక్ర‌వారం సాయంత్రం వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి విధులు కేటాయించిన సిబ్బందికి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ వైకుంఠ ఏకాద‌శికి వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యార్థం నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాలు, మాడ వీధుల్లో షెడ్లతోపాటు కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్ల‌లో విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని తెలిపారు. డిసెంబరు 17 నుండి 20వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు సుమారు వెయ్యి మంది సిబ్బందికి విధులు కేటాయించామ‌న్నారు. సిబ్బంది త‌మ‌కు కేటాయించిన ప్రాంతంలో అందుబాటులో ఉండి భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని సూచించారు. షెడ్ల‌కు అనుసంధానంగా ఉన్న మ‌రుగుదొడ్లు ప‌రిశుభ్రంగా ఉంచేలా భ‌క్తుల‌కు సూచ‌న‌లివ్వాల‌ని కోరారు. అన్ని విభాగాల సిబ్బంది అంకిత‌భావంతో ప‌నిచేసి సంస్థ ప్ర‌తిష్ట‌ను మ‌రింత ఇనుమ‌డింప‌చేయాల‌ని ఈ సంద‌ర్భంగా జెఈవో కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఎఫ్ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, సిఏవో శ్రీ శేష‌శైలేంద్ర‌, ఆరోగ్య‌శాఖాధికారి డా..శ‌ర్మిష్ట‌, అన్న‌ప్ర‌సాదం ప్ర‌త్యేకాధికారి శ్రీ వేణుగోపాల్ ఇతర విభాగాల అధికారులు, డెప్యుటేష‌న్ సిబ్బంది పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.