TIRUMALA SPRUCED UP FOR V-DAY-TTD EO_ తిరుమ‌ల‌లో వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి ప‌ర్వ‌దినాల‌కు విస్తృత ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్

Tirumala, 14 December 2018: All out efforts and steps have been taken to ensure hassle free arrangements to devotees for darshan on the crucial day of Vaikunta Ekadasi and Vaikunta Dwadasi said TTD Executive Officer Sri Anil Kumar Singhal.

Inspecting the arrangements in four mada streets, Narayanagiri Gardens along with JEO Sri KS Srinivasa Raju and CVSO Sri Gopinath Jetti on Friday, the EO told media persons later, that the devotee rush for Vaikunta Ekadasi is usually on par with that of Garuda seva during Srivari Brahmotsavams and hence extended arrangements have been made in accommodation, Anna Prasadam, water distribution etc. He said the VQC complex for December 18th Vaikunta Ekadasi darshan will be opened up from 12.30 of December 16th where there would be 28 hours wait. In view of the past experiences, special sheds were also being laid out on mada streets to seat around 40,000 devotees.

EO said the devotees will be sent inside VQC 2 first and then in VQC-1 compartments and later into sheds of Alwar tank lines, Narayanagiri gardens. Later into Special sheds of Mada streets via N1 Gate near Medaramitta. All arrangements are made for toilets, drinking water and Anna Prasadam at all sheds throughout and special steps taken for sanitation and cleanliness. He said work schedule will be given to all officers on lines of Garuda Seva and an action plan is prepared in co-ordination with Srivari Sevakulu, Scouts & Guides, Sanitary Staffs, Vigilance etc. Last year 1.70 lakhs devotees were given Vaikuntha Dwara darshan on these two auspicious days and appealed to devotees to plan their Tirumala visit well so that they need not have to wait for long in queue lines.

SE-2 Sri Ramachandra Reddy, SE Electrical Sri Venkeswarlu, DyEO Temple Sri Harindranath, VSOs-Sri Manohar, Smt Sadalakshmi, Health Officer Dr Sharmista, catering officer Sri Shastri and others participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమ‌ల‌లో వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి ప‌ర్వ‌దినాల‌కు విస్తృత ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్

డిసెంబ‌రు 14, తిరుమల 2018: తిరుమ‌ల‌లో డిసెంబ‌రు 18న వైకుంఠ ఏకాద‌శి, డిసెంబ‌రు 19న ద్వాద‌శి ప‌ర్వ‌దినాల‌కు విశేషంగా విచ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా విస్తృతంగా ఏర్పాట్లు చేప‌డుతున్నామ‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ వెల్ల‌డించారు. తిరుమ‌ల‌లో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టితో క‌లిసి శుక్ర‌వారం నాడు ఈవో ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల గ‌రుడ‌సేవ త‌రువాత వైకుంఠ ఏకాద‌శికి తిరుమ‌ల‌కు ఎక్కువ మంది భ‌క్తులు వ‌స్తార‌ని, వీరంద‌రికీ అన్ని వ‌స‌తులు క‌ల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని తెలిపారు. డిసెంబ‌రు 18న‌ వైకుంఠ ఏకాద‌శి ద‌ర్శ‌నం కోసం డిసెంబ‌రు 16వ తేదీ అర్ధ‌రాత్రి 12.30 గంట‌ల త‌రువాత నుండి భ‌క్తుల‌ను వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి పంపుతామ‌ని వెల్ల‌డించారు. అక్క‌డ దాదాపు 28 గంట‌లు భ‌క్తులు వేచి ఉండాల్సి వ‌స్తుంద‌న్నారు. గ‌త సంవ‌త్స‌రం అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని భ‌క్తులు చ‌లికి ఇబ్బందులు ప‌డ‌కుండా ఈసారి మాడ వీధుల్లో దాదాపు 40 వేల మంది కూర్చునేందుకు వీలుగా ప్ర‌త్యేకంగా షెడ్లు ఏర్పాటుచేశామ‌ని తెలిపారు. భ‌క్తుల‌ను ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌- 2, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌- 1లోకి అనుమ‌తిస్తామ‌ని, అవి నిండిన త‌రువాత వ‌రుస‌గా ఆళ్వార్ ట్యాంక్ లైన్‌, నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లోని షెడ్లలోకి పంపుతామ‌న్నారు. ఆ త‌రువాత మేద‌ర‌మిట్ట వ‌ద్ద గ‌ల ఎన్‌1 గేటు ద్వారా మాడ వీధుల్లో ప్ర‌త్యేకంగా ఏర్పాటుచేసిన షెడ్ల‌లోకి అనుమ‌తిస్తామ తెలియ‌జేశారు. షెడ్ల వ‌ద్ద తాగునీరు, అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ చేస్తామ‌ని, మ‌రుగుదొడ్ల వ‌స‌తి క‌ల్పించామ‌ని తెలిపారు. ఈరోజు నుండి అద‌నంగా పారిశుద్ధ్య సిబ్బందిని వినియోగిస్తున్న‌ట్టు చెప్పారు.

గ‌రుడ‌సేవకు విధులు కేటాయించిన త‌ర‌హాలో సీనియ‌ర్ అధికారుల‌కు ఆయా ప్రాంతాల్లో బాధ్య‌త‌లు అప్ప‌గిస్తామ‌ని, అన్ని ప్రాంతాల్లో శ్రీ‌వారి సేవ‌కులు, పారిశుద్ధ్య సిబ్బంది, ప‌ర్య‌వేక్ష‌ణ సిబ్బంది వివ‌రాల‌తో క్షేత్ర‌స్థాయిలో ప్ర‌ణాళిక‌లు రూపొందించామ‌ని ఈవో తెలిపారు. టికెట్ కౌంట‌ర్లు, క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో ఎక్క‌డా భ‌క్తులు ఇబ్బందులు ప‌డ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. గ‌తేడాది ఏకాద‌శి, ద్వాద‌శి రోజుల్లో 1.70 ల‌క్ష‌ల మంది భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించామ‌ని చెప్పారు. ఈసారి భ‌క్తులు ముందుగా తిరుమ‌ల‌కు వ‌చ్చి ఎక్కువ స‌మ‌యం క్యూలైన్ల‌లో వేచి ఉండ‌కుండా త‌మ తిరుమ‌ల యాత్ర ప్ర‌ణాళిక రూపొందించుకోవాల‌ని కోరారు.

అంత‌కుముందు వైభ‌వోత్స‌వ మండ‌పం నుండి ఈవో త‌నిఖీలు ప్రారంభించారు. అక్క‌డ ఫైబ‌ర్ తో ఏర్పాటుచేసిన విద్యుత్ క‌టౌట్‌ను ప‌రిశీలించారు. ఆ త‌రువాత మాడ వీధుల్లో ఏర్పాటుచేసిన షెడ్ల‌ను, నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లోని షెడ్ల‌ను, నూత‌న మ‌రుగుదొడ్ల‌ను ప‌రిశీలించి ఇంజినీరింగ్ అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఈ త‌నిఖీల్లో టిటిడి ఎస్ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్ఇ(ఎల‌క్ట్రిక‌ల్స్‌) శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ హరీంద్రనాథ్, విఎస్వోలు శ్రీ మనోహర్, శ్రీ‌మ‌తి స‌దాల‌క్ష్మి, ఆరోగ్యశాఖాధికారి డా.. శర్మిష్ట, క్యాట‌రింగ్ అధికారి శ్రీ శాస్త్రి ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.