PROVIDE BETTER FACILITIES TO SRIVARI SEVAKULU AT NEW SRIVARI SADAN- TIRUMALA JEO_ నూతన శ్రీవారి సేవా సదన్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 8 May 2018: TTD Joint Executive Officer, Tirumala Sri KS Sreenivasa Raju today directed the officials that improved facilities should be provided to the Srivari Sevakulu at the new Srivari Sadan.

At his review meeting with senior officials at the Annamayya Bhavan, Tirumala on Tuesday he urged the officials to take up on war footing the provision of improved facilities like lockers, registration process, food, accommodation, Medicare, electrical works, training and meditation center for Srivari Sevakulu and the Scouts and Guides. TTD would hire experts to train them on their tasks in the temple and other locations.

He said the Srivari Sevakulu should always be armed with updated information, which they should impart with the devotees waiting in the VQC and other queue lines. Adequate arrangements be made at all locations to tackle the summer rush of devotes after exam results. The allotment of sarva darshan tickets should also be extended.

He also directed the officials make arrangements for darshan, accommodation etc. at Tirumala for facilitating the devotees who acquired SD free tokens at Tirupati itself.

FACAO Sri Balaji, In Charge CVSO Sri SivaKumar Reddy, SE-2 Sri Ramachandra Reddy, DyEO Sri Harindranath, Sri Balaji, Sri Sridhar, Smt Nagaratna, DFO Sri Phanikumar Naidu, Annaprasadam OSD Sri Venugopal, Health officer Dr Sharmista, VSO Smt Sadalakshmi, Transport GM Sri Sesha Reddy and others were present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFIER, TTDs, TIRUPATI

నూతన శ్రీవారి సేవా సదన్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

మే 8, తిరుమల 2018: శ్రీవారి భక్తులకు సేవలందించేందుకు తిరుమలకు వస్తున్న సేవకులకు నూతనంగా నిర్మిస్తున్న సేవా సదన్‌ భవనంలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో వివిధ విభాగాల అధికారులతో మంగళవారం జెఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ నూతన శ్రీవారి సేవా సదన్‌ భవనంలో సేవకులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలన్నారు. లాకర్స్‌ ఏర్పాటు, సేవకుల నమోదు ప్రక్రియ, వసతి, భోజనం, వైద్యం,ఎలక్ట్రికల్‌ పనులు, సమావేశ మందిరం, సేవకులకు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు నిపుణులతో శిక్షణ తదితర ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.

కంపార్ట్‌మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించాలని సూచించారు. వేసవి సెలవులు, పలు పరీక్షల ఫలితాల వెల్లడి నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి అధికంగా భక్తులు విచ్చేస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టు పటిష్ట ఏర్పాట్లకు చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా సమయ నిర్దేశిత ఉచిత సర్వదర్శనం టోకెన్ల జారీ విధానంపై మరింత విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. సమయ నిర్దేశిత సర్వదర్శనంకు ఉచితంగా టోకెన్లు పొంది తిరుమలకు చేరుకున్న భక్తులకు అందించాల్సిన సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో ఎఫ్‌ఏసిఏవో శ్రీ బాలాజీ, ఇన్‌చార్జీ సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌ రెడ్డి, ఎస్‌ఈ 2 శ్రీ రామచంద్రారెడ్డి, డిప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్‌, శ్రీ బాలాజీ, శ్రీ శ్రీధర్‌, శ్రీమతి నాగరత్న, డిఎఫ్‌ఓ శ్రీ ఫణికుమార్‌ నాయుడు, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, ఆరోగ్యశాఖాధికారి డా. శర్మిష్ట, విఎస్‌వో శ్రీమతి సదాలక్ష్మీ, ట్రాన్స్‌పోర్ట్‌ జీఎం శ్రీ శేషారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.