EXPERIMENTAL TIME SLOTS FOR SARVA DARSHAN FROM DEC 18- TIRUMALA JEO_ డిసెంబరు 18 నుంచి ప్రయోగాత్మకంగా సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్‌ : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 8 December 2017: With goal to give quicker darshan to devotees in sarva darshan and reduce their waiting time in the Vaikuntam queue complex, the TTD plans to experimentally allot time slots from December 18.

Disclosing this to media at Annamayya bhavan the Tirumala JEO Sri KS Sreenivasa Raju said 117 counters have been set up at 14 regions of Tirumala to issue tokens for sarva darshan (free darsan) on a pilot basis for 5-7 days for all devotees with Aadhar cards. Only such devotees with tokens will be given entry at the Divya darshan complex.

The token system will be fully operational after two months with suitable changes based on the feedback from devotees, he said adding that devotees without Aadhar card can have darshan through the Sarva darshan complex.

POTU MODERNIZATION WORKS

JEO Sri Raju said the TTD has taken up modernization works of the Vakulamata Potu inside Srivari temple where Anna prasadam for Srivari Naivedyam is prepared.
He said works were under way at the Padi potu and additional Potu at VQC etc since last two months and the laddu production will henceforth hiked by another 50,000 to 80,000 laddus per day from Dec.20.Presently 2.80 lakhs per day to 3.10 lakh laddus were produced there.

He said on a long term works basis increasing the works for laddu boondi preparation were also afoot and will be completed in 4 to 6 months.The issue of staff in Potu and additional Potu has been resolved, he said.

The JEO said all arrangements for Vaikunta Ekadasi on December 29 and Dwadasi on Dec.30 were taken up on a war footing and will reviewed again on Dec.12.

With objective of providing better conveniences to common devotees, the TTD has suspended VIP breaks from Dec.23 to January second week, except for protocol VIP breaks.

He said currently one Aadhar is accepted while applying for VIP break tickets but from January 1st week all applicants will have to provide Aadhar ahead of issue of tickets.

Among others TTD SE-2 Sri Ramachandra Reddy, DyEOs Sri Kodandarama Rao, Sri Venugopal, VGO Sri Raveendra Reddy, Catering official Sri GLN Shastry and OSD Sri Lakshminarayana Yadav participated in the meeting.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

డిసెంబరు 18 నుంచి ప్రయోగాత్మకంగా సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్‌ : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

తిరుపతి, 2017 డిసెంబరు 08: సర్వదర్శనం భక్తులు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండా త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు డిసెంబరు 18వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా టైంస్లాట్‌ విధానాన్ని అమలుచేస్తామని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం జెఈవో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుమలలోని 14 ప్రాంతాల్లో 117 కౌంటర్లు ఏర్పాటుచేశామని, మొదట 5 నుంచి 7 రోజుల పాటు ప్రయోగాత్మకంగా భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. ఆధార్‌కార్డు ద్వారా భక్తులు సర్వదర్శనం టోకెన్లు పొందవచ్చని, ఈ టోకెన్లు పొందిన భక్తులను దివ్యదర్శనం కాంప్లెక్స్‌ ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని అన్నారు. భక్తుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని 2 నెలల తరువాత పూర్తిస్థాయిలో టైంస్లాట్‌ విధానాన్ని అమలుచేస్తామని తెలిపారు. ఆధార్‌కార్డు లేని భక్తులు యథావిధిగా సర్వదర్శనం కాంప్లెక్స్‌ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చన్నారు.

పోటు ఆధునీకరణకు చర్యలు :

శ్రీవారి నైవేద్యానికి వినియోగించే అన్నప్రసాదాలు తయారుచేసే వకుళామాత పోటు, లడ్డూ ప్రసాదాలు తయారుచేసే పడిపోటు, అదనపు పోటులో ఆధునీకరణకు చర్యలు చేపట్టినట్టు జెఈవో తెలిపారు. వకుళామాత పోటును మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు రెండు నెలల పాటు ఆధునీకరణ పనులు జరుగుతాయన్నారు. గుడిలోపల ఉండే పడిపోటు, బయట ఉండే అదనపు పోటులోనూ పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు చెప్పారు. సాధారణంగా రోజుకు 2.80 లక్షల నుంచి 3.10 లక్షల వరకు లడ్డూలు తయారు చేస్తున్నట్టు తెలిపారు. డిసెంబరు 20వ తేదీ నుంచి అదనంగా రోజుకు 50 వేల నుంచి 80 వేల వరకు శ్రీవారి లడ్డూలను తయారుచేసేందుకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేసినట్టు చెప్పారు. దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా బూందీ తయారీకి సంబంధించి అవకాశమున్న చోట పోటు సిబ్బంది సమ్మతితో యాంత్రీకరణకు ఏర్పాట్లు చేపడుతున్నామని, ఇందుకు 4 నుంచి 6 నెలల సమయం పడుతుందని తెలిపారు. పోటు, అదనపు పోటులో సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

వైకుంఠ ఏకాదశికి ముమ్మరంగా ఏర్పాట్లు :

డిసెంబరు 29న వైకుంఠ ఏకాదశి, 30న వైకుంఠ ద్వాదశికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని జెఈవో తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి విషయాలపై చర్చించేందుకు డిసెంబరు 12న సమావేశం జరుగనుందని చెప్పారు. రద్దీ సమయాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేయడంలో భాగంగా డిసెంబరు 23వ తేదీ నుంచి జనవరి రెండో వారం వరకు విఐపి బ్రేక్‌ దర్శనాలను ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేస్తామని తెలిపారు. ప్రస్తుతం బ్రేక్‌ దర్శనాలకు వచ్చే సభ్యుల్లో ఒకరి ఆధార్‌ కార్డును మాత్రమే స్వీకరిస్తున్నామని, జనవరి మొదటి వారం నుంచి తప్పనిసరిగా సభ్యులందరి ఆధార్‌ కార్డులను సమర్పించాలని తెలియజేశారు.

ఈ సమావేశంలో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ కోదండ రామారావు, శ్రీ వేణుగోపాల్‌, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, క్యాటరింగ్‌ అధికారి శ్రీజిఎల్‌ఎన్‌.శాస్త్రి, ఓఎస్‌డి శ్రీ లక్ష్మీనారాయణ యాదవ్‌ పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.