TRIAL RUN OF SD COUNTERS BY SECOND WEEK OF DECEMBER-TIRUMALA JEO_ డిసెంబరు రెండో వారంలో ప్రయోగాత్మకంగా సర్వదర్శనం భక్తులకు టైమ్‌స్లాట్‌ : తిరుమల జెఈఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 14 November 2017: The trial run of Time slot system for Sarva Darshan will commence from second week of December and the Counters meant to issue the tokens should get ready by December 5, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.

During the weekly review meeting on Tuesday at Annamaiah Bhavan in Tirumala with senior officers of TTD, the JEO said, the management is considering this as a prestigious project which is aimed to facilitate the common pilgrims more comfortable darshan with less waiting hours in queue lines and compartments. He directed the civil, electrical and IT wings to complete all the necessary arrangements within the stipulated time. “All the 150 centres coming up in 21 locations should be well equipped with the required electronic gadgets to issue time slot darshan tokens without any flaws”, the JEO said.

He also reviewed on the progress of works related to Vakulamata Potu, Padi Potu, additional potu, Laddu complex etc. He said the call centre exclusively meant for accommodation will also commence in the next few days.

Later speaking to media, the JEO said, all the arrangements for Vaikuntha Ekadasi are in pace and all works will be completed by December 20.

CE Sri Chandra Sekhar Reddy, FACAO Sri Balaji, SE II Sri Ramachandra Reddy and other officers were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డిసెంబరు రెండో వారంలో ప్రయోగాత్మకంగా సర్వదర్శనం భక్తులకు టైమ్‌స్లాట్‌ : తిరుమల జెఈఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

నవంబరు 14, తిరుమల, 2017: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు అధిక సమయం క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండా చూసేందుకు డిసెంబరు రెండో వారం నుంచి ప్రయోగాత్మకంగా సర్వదర్శనం భక్తులకు టైమ్‌స్లాట్‌ విధానాన్ని అమలుచేస్తామని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం జెఈవో సీనియర్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ డిసెంబరు రెండో వారంలో సర్వదర్శన టైమ్‌స్లాట్‌ విధానాన్ని కొన్ని రోజులపాటు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామని, ఫిబ్రవరి నుంచి పూర్తిస్థాయిలో అమలుచేస్తామని తెలిపారు. ఇందుకుగాను తిరుమలలోని 21 ప్రాంతాలలో దాదాపు 150 టోకెన్‌ జారీ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ కౌంటర్లలో కావాల్సిన కంప్యూటర్లు, ఇతర పరికరాలను వెంటనే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కౌంటర్ల వద్ద ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌, ఇడిపి, అన్నప్రసాదం తదితర విభాగాలు ఏమాత్రం ఆలస్యం కాకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు.

అదేవిధంగా వకుళామాతా పోటు, పడిపోటు, అదనపుపోటు, లడ్డూ కాంప్లెక్స్‌ల తదితరాలకు సంబంధించిన అబివృద్ధి పనులను ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తిచేయాలని జెఈవో ఆదేశించారు. గదుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు త్వరలో తిరుమలలో ఎఫ్‌ఎంఎస్‌ కాల్‌సెంటర్‌ ప్రారంభిస్తామని తెలిపారు. డిసెంబరు 29న వైకుంఠ ఏకాదశిని దృష్టిలో ఉంచుకొని క్యూలైన్లు, షెడ్లు తదితర పనులను డిసెంబరు 20వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. వైకుంఠ ఏకాదశి ముందురోజు లక్ష మందికి పైగా భక్తులు క్యూలైన్లలో వేచి ఉంటారని, వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదాలు, తాగునీరు తదితర వసతులు కల్పించేందుకు సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. ఈవో ఆదేశాల మేరకు అన్ని విభాగాలు వైకుంఠ ఏకాదశికి పూర్తిగా సన్నద్ధం కావాలని కోరారు.

ఈ సమావేశంలో టిటిడి ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ బాలాజీ, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మొదటి ఘాట్‌ రోడ్డులో వేగ నిరోధకాలను పరిశీలించిన జెఈవో

తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో ప్రమాదాలను అరికట్టేందుకు వేగనిరోధకాల ఏర్పాటుపై జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలన చేపట్టారు. వాహనాల అతివేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్‌ బ్రేకర్లు, రెయిలింగ్‌ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. జెఈవో వెంట ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఇఇ శ్రీ శివరామకృష్ణ ఇతర ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.