JOYFUL UGADI CELEBRATION IN MAHATI _ మహతిలో ఘనంగా ఉగాది ఉత్సవం

Tirupati, 09 April 2024: The Krodhinama Ugadi celebrations by TTD went off in a colourful manner in Mahati on Tuesday in Tirupati.

The Panchanga Shravanam was rendered by Dr Vishnubhattacharya, after Mangaladhwani and Vedaswasti followed by Astavadhanam, a literary feat which is unique for Telugu, that captivated the audience.

The fancy dress exhibiting various versatile personalities in Telugu literature, freedom fighters etc. by the children of TTD employees’ stood as a special attraction.

DyEO Welfare Smt Snehalata and others, denizens of Tirupati also participated. Later Ugadi Pachchadi was distributed among all the participants.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మహతిలో ఘనంగా ఉగాది ఉత్సవం
 
తిరుపతి, 2024   ఏప్రిల్‌  09: టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో మంగళవారం ఉగాది ఉత్సవం ఘనంగా జరిగింది.
 
ఈ సందర్భంగా జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు ఆచార్య వేదాంతం శ్రీ‌విష్ణుభ‌ట్టాచార్యులు పంచాంగ శ్రవణం చేస్తూ తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములను తెలుసుకోవడమే పంచాంగమన్నారు. పూర్వం రాజులు ప్రతిరోజూ పంచాంగ శ్రవణం చేసేవారని, ఇది ఎంతో పుణ్యఫలమని అన్నారు.  శ్రీవేంకటేశ్వరుని భక్తితో సేవిస్తే అన్నీ శుభాలే కలుగుతాయన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. అనంతరం ఆయా రాశుల వారికి ఈ సంవత్సరంలో కలిగే ఫలాలను తెలియజేశారు. అనంతరం పంచాంగకర్తను శ్రీవారి ప్రసాదం, నూతన వస్త్రాలతో  సన్మానించారు. 
 
ముందుగా ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు చక్కగా మంగళధ్వని, ప్రార్థన వినిపించారు. ఆ తరువాత ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో వేదపండితులు వేదస్వస్తి నిర్వహించారు. 
 
ఆ తరువాత ఆచార్య దామోదర్ నాయుడు ఆధ్వర్యంలో శ్రీ ఆముదాల మురళి అష్టావధానం నిర్వహించారు. ఇందులో నిషిద్ధాక్షరి శ్రీ గోవిందయ్య, 
దత్తపది శ్రీమతి యువ శ్రీ, నెస్తాక్షరి  డా. కిట్టన్న, సమస్య డా. గంగాధర ప్రసాద్, వర్ణన డా. శ్రీమన్నారాయణ, ఆశువు శ్రీ బాల సుబ్రహ్మణ్యం, పురాణ పఠనం డా.పరమేశ్వరయ్య, అప్రస్తుత ప్రసంగం డా. పురుషోత్తం చేశారు. అనంతరం అవధానిని, ఇతర సభ్యులను టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి శ్రీ రాజగోపాలన్ సన్మానించారు. ఈ సందర్భంగా అందరికీ ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణీ చేశారు.
 
అనంతరం టీటీడీ ఉద్యోగుల పిల్లలకు సంప్రదాయ వేషధారణ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. 
 
ఈ కార్యక్రమంలో  సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహ లత,  ఇతర అధికారులు, ఉద్యోగులు, పుర ప్రజలు పాల్గొన్నారు.
 
టీటీడీ ముఖ్య  ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.