JYESTABHISHEKAM BEGINS AT SRI GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకం ప్రారంభం

Tirupati, 30 June 2023: The celestial festival of the annual Jyestabhishekam commenced at Sri Govindarajaswami temple in Tirupati on Friday.

 

The three-day fete is usually observed during the Ashada month every year with the rituals of Sata Kalasha Snapana, Maha Shanti Homa on day one at the Kalyana Mandapam where the Utsava idols were offered Snapana Tirumanjanam.

 

Later in the evening the utsava idols were offered Kavachadhivasam fete and paraded all along the Mada streets on a Tiruchi.

 

Tirumala pontiffs, DyEO Smt Shanti, Chief Archaka Sri Srinivasa Dikshitulu, AEO  Sri RaviKumar Reddy, Superintendent Sri Narayana, Sri Mohan Rao, Temple inspectors Sri Radhakrishna, Sri Dhananjayulu were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం

తిరుపతి, 2023 జూన్‌ 30: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్ఠాభిషేకం శుక్ర‌వారం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఆషాఢ మాసంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి కైంకర్యాలు నిర్వహించారు. శ‌త‌క‌ల‌శ‌స్న‌ప‌నం, మ‌హాశాంతి హోమం చేప‌ట్టారు. ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ల‌తో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం స్వామివారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాఢ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

ఈకార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ప్రధానార్చకులు, శ్రీ శ్రీనివాస దీక్షితులు, ఏఇవో శ్రీ ర‌వికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ నారాయణ, శ్రీ మోహన్ రావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రాధాకృష్ణ, 
శ్రీ ధనంజయులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.