SODASADINA KISHKINDAKANDA PARAYANAM COMMENCES _ షోడ‌శ‌దిన కిష్కింధాకాండ పారాయణదీక్ష ప్రారంభం

TIRUMALA, 30 JUNE 2023: Sodasadina Kishkindakanda Parayanam commenced on a grand religious note in Vasanta Mandapam at Tirumala on Friday.

 

According to Dharmagiri Veda Vignana Peetham Principal Sri KSS Avadhani, the 16-day Sodasadina Kishkindakanda  Parayanadeeksha will be observed in Tirumala till July 15.

 

The chapters in the Kishkindakanda will be recited by vedic pundits as per the syllables in “Marutasya Samovege Garudasya Samojave” shlokam.

 

On the first day shlokas from the first five chapters relevant to the first syllable “Ma” in the shloka padam were recited.

 

Ritwiks performed Homams and Japams in Dharmagiri also.

 

SVBC telecast the spiritual program live for the sake of global devotees.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

షోడ‌శ‌దిన కిష్కింధాకాండ పారాయణదీక్ష ప్రారంభం
 
– తొలిరోజు 5 సర్గలు పారాయణం
 
తిరుమల, 30 జూన్ 2023: తిరుమ‌ల‌ వ‌సంత మండ‌పంలో 16 రోజుల పాటు జరుగనున్న షోడ‌శ‌దిన కిష్కింధాకాండ పారాయణదీక్ష శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు జరిగిన ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
 
ఈ సందర్భంగా ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్.అవధాని మాట్లాడుతూ “మారుతస్య సమోవేగే గరుడస్య సమోజవే” అనే శ్లోకంలో మొదటి అక్షరానికి సూచికగా మొదటి రోజు 1 నుండి 5 వరకు గల సర్గలను పండితులు పారాయణం చేస్తున్నట్టు చెప్పారు. సీతమ్మ జాడను వెతుక్కుంటూ సుగ్రీవుని వద్దకు రాముడు వెళ్లడం, ఆంజనేయుని పరిచయం, రాముడు, సుగ్రీవుడు మైత్రి కుదుర్చుకోవడం, వాలిని శిక్షిస్తానని శ్రీరాముడు ఆభయం ఇవ్వడం తదితర ఘట్టాలను ఈ సర్గల ద్వారా తెలుసుకోవచ్చని వివరించారు.
 
వ‌సంత మండ‌పంలో 16 మంది నిష్ణాతులైన వేద పండితులు శ్లోకాలను పారాయణం చేశారు. అదేవిధంగా, ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠంలో మరో 16 మంది వేదపండితులు హోమాలు, జపాలు, వేదపారాయణం నిర్వహించారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.