JYESTABHISHEKAM IN SRI GT FROM JULY 22 TO 24_ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకానికి ఏర్పాట్లు పూర్తి

Tirumala, 21 July 2018: The annual Jyestabhishekaam will be observed in Sri Govinda Raja Swamy temple for three days from July 22 to 24.

On first day Kavacha Adhivasam, second day Kavacha Pratishta and on final day Kavacha Samarpana will be observed.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకానికి ఏర్పాట్లు పూర్తి

తిరుపతి, 2018 జూలై 21: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 22వ తేదీ ఆదివారం నుండి మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఈ సందర్భంగా స్వామివారి స్వర్ణ కవచాలకు మొదటిరోజు కవచ అధివశం, రెండో రోజు కవచ ప్రతిష్ఠ, మూడో రోజు కవచ సమర్పణ చేపడతారు. ఈ ఉత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం మహాశాంతి హోమం, పుణ్యాహవచనం, స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులను తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.