JYESTABHISHEKAM IN SRI GT FROM JULY 4_ శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్టాభిషేకం గోడపత్రికలు ఆవిష్కరణ
Tirupati, 1 July 2017: The three day annual Jyestabhishekam will be observed from July 4 to 6 in the famous shrine of Sri Govindaraja Swamy in Tirupati.
As a part of this on first day Kavacha Adhivasam, next day Kavacha Pratishtha and final day Kavacha Samarpana will be performed as per temple tradition.
During these three days Punyahavachanam, Shanti Homam, Snapanam, Satakalasa Snapanam and Veedhi Utsavam will be performed.
In connection with this religious fete Tirupati JEO Sri Pola Bhaskar has released the posters along with Temple DyEO Smt Varalakshmi in his chambers in TTD Adm Bldg on Saturday.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్టాభిషేకం గోడపత్రికలు ఆవిష్కరణ
తిరుపతి, 2017 జూలై 01: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 4 నుండి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్టాభిషేకం (అభిధేయక అభిషేకం) గోడపత్రికలను శనివారం సాయంత్రం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఇందులో స్వామివారి స్వర్ణకవచాలకు జూలై 4న కవచాధివాసం, జూలై 5న కవచ ప్రతిష్ఠ, జూలై 6న కవచ సమర్పణ నిర్వహిస్తారు. ఈ ఉత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం మహాశాంతి హోమం, పుణ్యాహవచనం చేపడతారు. ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం శతకలశస్నపనం, సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. ప్రతి ఏడాదీ ఆషాడ మాసం, జ్యేష్టా నక్షత్రం రోజున ఆలయంలో జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.