NYAYASUDHA PARAYANAM IN TIRUMALA FROM JULY 3_ జూలై 3 నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీమాన్ న్యాయసుధ పారాయణం
Tirumala, 1 July 2017: Following the Aradhana Mahotsavams of holy saint from Karnataka Sri Jayatheertha, Nyaya Sudha Parayanam will be rendered in Rituals temple from July 3.
As per legend, Jayatheertha in his earlier birth happened to the noble ox in the Ashram of the founder of Dvaita Siddhanta Sri Madhvacharya. During this period he learnt all the Neetisutras taught by the saint when he was in the form of holy ox.
In his next birth as Jayatheertha, he penned Nyaya Sudha Parayanam. When this is rendered it is believed that it will give good showers and prosperity prevails. With this great work Sri Jayatheertha is also known as Teekacharya.
Meanwhile this Nyayasudha Parayanam will be recited every day in Tirumala facing Vimana Venkateswara Swamy from July 3 to July 7 and again from July 10 to July 14.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూలై 3 నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీమాన్ న్యాయసుధ పారాయణం
తిరుమల, 2017 జూలై 01: శ్రీ జయతీర్థుల ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 3 నుంచి 7వ తేదీ వరకు, తిరిగి జూలై 10 నుంచి 14వ తేదీ వరకు శ్రీమాన్ న్యాయసుధ పారాయణం జరుగనుంది. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
శ్రీవారి ఆలయంలోని విమాన వేంకటేశ్వరస్వామివారికి ఎదురుగా వేదపారాయణదారులు న్యాయసుధను పారాయణం చేస్తారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ఈ పారాయణం జరుగుతుంది.
ద్వైతసిద్ధాంత ప్రతిష్టాపనాచార్యులైన శ్రీ మధ్వాచార్యులు ఆసేతు హిమాచలం సంచరించి శిష్యులకు సత్ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ 37 గ్రంథాలకు పైగా రచించారు. శ్రీవారి భక్తుడైన శ్రీ జయతీర్థులవారు పూర్వజన్మలో వ షభరూపంలో శ్రీ మధ్వాచార్యుల సన్నిధిలో ఉంటూ ద్వైత సిద్ధాంతభావాన్ని పూర్తిగా శ్రవణం చేసిన ప్రభావంతో తరువాత జన్మలో ఈ గ్రంథాలకు ‘న్యాయసుధ’ పేరుతో వ్యాఖ్యాన గ్రంథాన్ని రచించి తీకాచార్యులని ప్రసిద్ధి పొందారు. వీరి సాహిత్యాన్ని శ్రీపురందరదాస గ్రహించి వేల కీర్తనలు రచించారు. ‘న్యాయసుధ’ గ్రంథాన్ని పారాయణం చేయడం వల్ల వర్షాలు బాగా కురిసి దేశం సుభిక్షంగా ఉంటుందని, ప్రపంచశాంతి చేకూరుతుందని భక్తుల విశ్వాసం.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.