KALA NEERAJANAM IN NADA NEERAJANAM PLATFORM _ నాదనీరాజనం వేదికపై ఆకట్టుకున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు
Tirumala, 7 Oct. 19; The devotional cultural programmes were given a warm tribute by the devotees on Monday, who thronged Tirumala during annual brahmotsavams.
The programmes organised by all the cultural wings and projects of TTD remained a special attraction during the nine-day fete.
The religious discourse by Dr. Ananta Padmanabha Rao from Hyderabad, Sri B Raghunath flawless rendition of Annmaiah sankeertans during the Annamaiah Vinnapalu programme, Smt Siva Ratnam concert during Unjal Seva, Harikatha Parayanam by Smt Savitri Jayanthi allured the pilgrims.
The Carnatic musical vocal by Dr. YVS Padmavathi, Principal of SV College of Music and Dance of TTD at Asthana Mandapam enthralled the audience.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నాదనీరాజనం వేదికపై ఆకట్టుకున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు
తిరుమల, 2019 అక్టోబరు 07: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపంలో ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.
ఇందులో భాగంగా నాదనీరాజనం వేదికపై ఉదయం 5 నుండి 5.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి కె.రవిప్రభ బృందం మంగళధ్వని, ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు తిరుమల ధర్మగిరి వేదపాఠశాల విద్యార్థులు చతుర్వేద పారాయణం నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 7 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి సరోజ బృందం విష్ణుసహస్రనామ పారాయణం, ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన డా.అనంత పద్మనాభరావు ధార్మికోపన్యాసం చేశారు.
మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ బి.రఘునాథ్ బృందం అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు చెన్నైకి చెందిన కోవై.ఎస్.జయరామన్ బృందం నామసంకీర్తన నిర్వహించారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి కె.శివరత్నం బృందం ఊంజల్‌సేవలో అన్నమాచార్య సంకీర్తనలను వీనులవిందుగా గానం చేశారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి పి.సావిత్రి జయంతి భాగవతారిణి హరికథ పారాయణం చేశారు.
అదేవిధంగా, తిరుమలలోని ఆస్థానమండపంలో సోమవారం ఉదయం 11.30 నుండి 12.30 గంటల వరకు తిరుపతికి చెందిన డా.వై.వి.ఎస్.పద్మావతి బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.