KALIYAMARDHANA ALANKARAM _ కాళీయమర్దనాలంకారములో శ్రీకోదండరామస్వామి కటాక్షం
VONTIMITTA, 07 APRIL 2023: As part of ongoing annual brahmotsavams at Vontimitta Kodanda Ramalayam in YSR Kadapa district, Sri Rama in Kaliyamardhana Alankaram blessed devotees on Friday.
Temple DyEO Sri Natesh Babu, Temple Inspector Sri Dhananjeyulu and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
కాళీయమర్దనాలంకారములో శ్రీకోదండరామస్వామి కటాక్షం
ఒంటిమిట్ట, 2023 ఏప్రిల్ 07 : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం కాళీయమర్దనాలంకాములో స్వామివారు భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామివారు పురవీధుల్లో విహరించారు.
వాహనసేవ అనంతరం ఉదయం 11 గంటల నుండి స్నపన తిరుమంజనం వేడుకగా ప్రారంభమైంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో
శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనం పై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్
శ్రీ ధనుంజయులు భక్తులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 8న చక్రస్నానం
శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు చక్రస్నానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయ.
ఏప్రిల్ 9న పుష్పయాగం
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం సాయంత్రం 6 నుండి రాత్రి 9.00 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.