KALPAVRIKSHA VAHANAM HELD _ కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప అభయం

TIRUMALA, 28 JANUARY 2023: The second session of Vahana Sevas commenced with Kalpavriksha Vahanam, the fifth one in the series of Saptha Vahana Sevas.

As part of Radhasaptami on Saturday evening, the Kalpavriksha Vahana Seva was held between 4pm and 5pm.

Sri Malayappa along with Sridevi and Bhudevi blessed the devotees along the four mada streets.

Board members, TTD officials, a large number of devotees participated.

                                                   

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప అభయం

తిరుమల, 28 జనవరి 2023: తిరుమలలో శనివారంనాడు ‘రథసప్తమి’ ఉత్సవం సందర్భంగా ఐదో వాహనమైన కల్పవృక్ష వాహనసేవ ఘనంగా జరిగింది.

క‌ల్ప‌వృక్ష వాహ‌నం – ఐహిక ఫ‌ల ప్రాప్తి (సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు) :

క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్ప‌వృక్షం కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు.

టిటిడి బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, శ్రీ మొరంశెట్టి రాములు, శ్రీ మారుతి ప్రసాద్, శ్రీ మధుసూదన్ యాదవ్, జెఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ రమేష్ బాబు ఇత‌ర టిటిడి అధికారులు ఈ వాహ‌న సేవ‌లో పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.