KALPAVRIKSHA VAHANAM PROVIDES A CELESTIAL SPECTACLE TO DEVOTEES_ క‌ల్ప‌వృక్ష‌ వాహనంపై రాజమన్నార్‌స్వామి అలంకారంలో శ్రీ మలయప్ప

Tirumala, 26 September 2017: The devotees who thronged the hill town of Tirumala on Tuesday morning to witness the procession of Lord Malayappa on Celestial Kalpavriksha vahanam had a double dhamaka of divine blessings in the form of Lord Malayappa and the divine tree.

On the fourth day morning, the Lord along with His two Consorts, Sridevi and Bhudevi took a ride on the divine tree that bestows upon the seekers whatsoever they ask for.

SIGNIFICANCE: In innumerable Brahmandas(Cosmos) described in Puranas, there is one heaven and in each heaven there is one Divine Tree which has the wish full-filling power and it is called Kalpavriksha.

By taking celestial ride on Kalpavriksha Vahanam, the Lord Malayappa, who is a Kalpavriksha of all Kalpavrikshas gives a splendorous darshan to the devotees with His divine Kalpavallis-Sridevi and Bhudevi.

TTD EO Sri Anil Kumar Singhal, JEOs Sri KS Sreenivasa Raju, Sri Pola Bhaskar, CVSO Sri Ake Ravikrishna, Temple DyEO Sri Rama Rao and others took part.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

క‌ల్ప‌వృక్ష‌ వాహనంపై రాజమన్నార్‌స్వామి అలంకారంలో శ్రీ మలయప్ప

సెప్టెంబర్‌ 26, తిరుమల 2017: శ్రీవారి నవరాత్రి బ్రహ్మూెత్సవాల్లో భాగంగా నాలుగో రోజు మంగళవారం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి క‌ల్ప‌వృక్ష‌ వాహనంపై శ్రీ రాజమన్నార్‌స్వామివారి అలంకారంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9.00 గంటల నుండి 11.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్ప‌వృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు.

కాగా మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 7.00 నుండి 8.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరిగాయి. రాత్రి 9.00 నుండి 11.00 గంటల వరకు సర్వభూపాల వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.

ఈ కార్యక్రమంలో తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధి శ్రీకె.యస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

కాగా బ్రహ్మూెత్సవాలలో ఐదో రోజైన బుధవారం ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు మోహినీ అవతారం, రాత్రి 7.30 నుండి 1.00 గంటల వరకు గరుడ వాహనంపై శ్రీవారు ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.