FULLY GEARED TO SUPPLY 5.7 LAKH MEALS ON GARUDA SEVA DAY-V VENUGOPAL_ గరుడసేవ నాడు నిరంతరాయంగా అన్నప్రసాదాలు : టిటిడి అన్నప్రసాదం డెప్యూటీ ఈవో శ్రీ వేణుగోపాల్‌

Tirumala, 26 September 2017: TTD is fully geared to supply around 5 70 lakh meals to the devotees who come for the celestial event of Garuda Vahanam on Wednesday,says the Dy EO,( Annaparasadam) Sri Venugopal.

Addressing reporters at the Media center organised as part of the Brahmotsavam- 2017 he said three lakh packets of butter milk have also been stocked to serve devotees and a 10,000 strong contingent of police, scouts, employees etc.’We normally get 5-6 tons of vegetables but we expect about 10 tons for the garuda seva day’ he said.

He said the Annaprasadam staff were fully geared to supply water,buttermilk, milk, coffee, snacks and meal packets to devotees siting in the galleries from morning 8.AM to 12 PM. ‘Food packets will be prepared at the three kitchens of VQC-2 and Vengamamba building’ he said.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD, TIRUPATI

గరుడసేవ నాడు నిరంతరాయంగా అన్నప్రసాదాలు : టిటిడి అన్నప్రసాదం డెప్యూటీ ఈవో శ్రీ వేణుగోపాల్‌

సెప్టెంబర్‌ 26, తిరుమల 2017: గరుడసేవ నాడు గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు ఉదయం 8 నుంచి రాత్రి 1 గంట వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తామని టిటిడి అన్నప్రసాదం డెప్యూటీ ఈవో శ్రీవేణుగోపాల్‌ తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో మంగళవారం అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ గరుడసేవనాడు 3.70 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేపట్టామని, 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందిస్తామని తెలిపారు. గ్యాలరీల్లోని భక్తులకు బిస్బెల్లా బాత్‌, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, ఉప్మా, కాఫి, పాలు అందిస్తామన్నారు. తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, సిఆర్‌వో, రాంభగీచా విశ్రాంతిగృహం వద్ద ఉన్న ఫుడ్‌ కౌంటర్ల ద్వారా రోజుకు 40 వేల మందికి అన్నప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు. తిరుపతిలోని పార్కింగ్‌ ప్రదేశాల్లోనూ భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తామన్నారు. తిరుమలలో 1985వ సంవత్సరంలో 2 వేల మందితో అన్నప్రసాద వితరణను ప్రారంభించామని, ప్రస్తుతం 1.5 లక్షల మంది వరకు అన్నప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు.

మీడియా సమావేశంలో టిటిడి క్యాటరింగ్‌ అధికారి శ్రీ జిఎల్‌ఎన్‌.శాస్త్రి, టిటిడి పిఆర్‌వో డా|| టి.రవి, ఎపిఆర్వో కుమారి పి.నీలిమ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.