కల్పవృక్ష వాహనసేవలో అలరించిన కళాప్రదర్శనలు
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
కల్పవృక్ష వాహనసేవలో అలరించిన కళాప్రదర్శనలు
సెప్టెంబరు 16, తిరుమల 2018: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం జరిగిన కల్పవృక్ష వాహనసేవలో కళాప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇందులో గుజరాత్ నుండి సంప్రదాయ నృత్యం, మణిపూర్ నుండి సంకీర్తన పంగ్, కర్తాళ్, కర్ణాటక నుండి పాట కుణిత, పూజ కుణిత, తెలంగాణ నుండి ఒగ్గు, డోలు, తమిళనాడు నుండి కయిసిలంబట్టం, కరగట్టం, డమ్మీ హార్స్, అమ్మన్ వేషం, మాదట్టం, కోలాటం, నెమలి నృత్యం, దేవరాట్టం, తప్పాట్టం, సేవైయాట్టం, ఓయిలాట్టం, జానపద కళలు ప్రదర్శించారు. అదేవిధంగా పుదుచ్చేరి నుండి జానపద నృత్యం, మయిలాట్టం, కరకట్టం, కలియాట్టం, కేరళ నుండి తెయ్యాట్టం, చండమేళం తదితర కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.