DIFFERENT STATE ARTISTES TO PERFORM FOR G-DAY_ శ్రీ‌వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల్లో 7 రాష్ట్రాల నుండి క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లు : టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి డా..ర‌మ‌ణ‌ప్ర‌సాద్‌

Tirumala, 16 September 2018: Artistes who have expertise in different traditional art forms of the respective states will perform before Garuda Vahana Seva, said Hindu Dharma Prachara Parishad (HDPP) Secretary, Sri Ramana Prasad.

Addressing media persons in Media Centre in Tirumala on Sunday, he said, specialised artistes from Gujrat, Manipur, Karnataka, Telengana, Kerala, will perform unique dance forms before various vahana sevas on September 16, 17 and 18.

He said, the never seen before art forms includes, dummy horse, Devarattam, Oyilattam, Chenda Melam etc. to glare up the annual festival.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీ‌వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల్లో 7 రాష్ట్రాల నుండి క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లు : టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి డా..ర‌మ‌ణ‌ప్ర‌సాద్‌

సెప్టెంబరు 16, తిరుమల 2018: ఈసారి జ‌రుగుతున్న శ్రీ‌వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల్లో మొద‌టిసారిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తోపాటు 7 ఇత‌ర రాష్ట్రాల నుండి క‌ళాకారుల‌ను ఆహ్వానించి ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటుచేశామ‌ని, వీటికి భ‌క్తుల నుండి విశేష స్పంద‌న ల‌భిస్తోంద‌ని టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి డా..ర‌మ‌ణ‌ప్ర‌సాద్ వెల్ల‌డించారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డా..ర‌మ‌ణ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ సెప్టెంబ‌రు 17న గ‌రుడ‌సేవ‌ను పుర‌స్క‌రించుకుని 16, 17, 18వ తేదీల్లో ఇత‌ర రాష్ట్రాల క‌ళాకారుల ప్ర‌ద‌ర్శ‌న‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌న్నారు. ఇందులో గుజ‌రాత్ నుండి సంప్ర‌దాయ నృత్యం 1 బృందం, మ‌ణిపూర్ నుండి సంకీర్త‌న పంగ్‌, క‌ర్తాళ్ 1 బృందం, క‌ర్ణాట‌క నుండి పాట కుణిత‌, పూజ కుణిత 4 బృందాలు, తెలంగాణ నుండి ఒగ్గు, డోలు 2 బృందాలు, త‌మిళ‌నాడు నుండి క‌యిసిలంబ‌ట్టం, క‌ర‌గ‌ట్టం, డ‌మ్మీ హార్స్‌, అమ్మ‌న్ వేషం, మాద‌ట్టం, కోలాటం, నెమ‌లి నృత్యం, దేవ‌రాట్టం, త‌ప్పాట్టం, సేవైయాట్టం, ఓయిలాట్టం, జాన‌ప‌ద క‌ళ‌లు 6 బృందాలు ఉన్నాయ‌న్నారు. అదేవిధంగా పుదుచ్చేరి లలిత ఆర్ట్ క్రాఫ్ట్ బృందంతో జాన‌ప‌ద నృత్యం, మ‌యిలాట్టం, క‌ర‌క‌ట్టం, క‌లియాట్టం, అతిర్వుగ‌ళ్ క‌ళైకుజు బృందంతో త‌ప్ప‌ట్టం, డ‌మ్మీహార్స్‌, ఓయిలాట్టం, మ‌యిలాట్టం, శ్రీ ఉద‌యం నాట్యాల‌య బృందంతో క‌లాటం, కావ‌డియాట్టం, కేర‌ళ నుండి తెయ్యాట్టం, చండ‌మేళం, వ‌ణిత క‌థాక‌ళి 3 బృందాలు ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్టు తెలిపారు. 24 భ‌జ‌న బృందాల్లో 300 మంది క‌ళాకారులు ఉంటార‌ని, వీరు 2 రోజుల‌కోసారి మారుతుంటార‌ని, ఇత‌ర రాష్ట్రాల నుండి 250 మందికిపైగా క‌ళాకారులు వ‌చ్చార‌ని తెలిపారు.

వాహ‌న‌సేవ స‌మ‌యాల్లో మాడ వీధుల్లో 8 బృందాలతో నామ‌సంకీర్త‌న జ‌రుగుతుంద‌ని ఆయ‌న తెలిపారు. వాహ‌న‌సేవ‌ల్లోని భ‌జ‌న‌ల్లో చెక్క‌భ‌జ‌న‌, కోలాటం, అడుగుల భ‌జ‌న‌, పిల్ల‌నగ్రోవి, గ‌ర‌గ‌ల భ‌జ‌న‌, కీలుగుర్రాలు, కులుకు భ‌జ‌న‌, త‌ప్పిట‌గుళ్లు, బ‌ళ్లారి డ్ర‌మ్స్ ఉంటాయ‌ని తెలియ‌జేశారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో తిరుమ‌ల‌లోని నాద‌నీరాజ‌నం, ఆస్థాన‌మండ‌పం, తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రం, అన్న‌మాచార్య క‌ళామందిరం, రామ‌చంద్ర పుష్క‌రిణిలో ధార్మిక‌, భ‌క్తి సంగీతం, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌న్నారు.ఆ త‌రువాత కేర‌ళ‌, పుదుచ్చేరి, త‌మిళ‌నాడు రాష్ట్రాల నుండి విచ్చేసిన క‌ళాబృందాల ప్ర‌తినిధులు మాట్లాడారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.