TTD CLOCKS 90% OCCUPANCY OF KALYANA MANDAPAMS_ ఆన్‌లైన్‌లో టిటిడి కల్యాణ వేదికలు – ఆన్‌లైన్‌ బుకింగ్‌కు విశేష స్పందన

Tirupati, 20 Jun. 19: In what could be seen as a stellar achievement, the online booking initiative of 256 Kalyana mandapams of TTD have clocked 90% occupancy level, which is an incredible gesture.

Following a special drive of TTD Executive Officer Sri Anil Kumar Singhal to streamline devotee facilitation in TTD Kalyana mandapams five of them at Kuppam, Rajam, Narsapuram, Mahboobnagar and Bengaluru have bagged prestigious ISI certificates under personal monitoring by Tirupati JEO Sri.B Lakshmikantham.

TTD has set forth an ambitious agenda to procure such recognition for many more Kalyana mandapams through modernising infrastructure and streamlining administration in a phased manner.

TTD has rolled out renovation of Kalyana mandapams at Narsapuram in West Godavari, Rajam in Srikakulam and Mahboobnagar in Telangana with redesign and repainting, kitchen, dining hall, the bride and groom rooms besides installing LED lights, fans etc.

Similarly, the wedding platforms are decked with portraits from Sri Padmavathi Parinayam and colourful photos of Lord Venkateswara and his consorts besides lush green landscapes with flower gardens.

TTD has fine-tuned supervision of Kalyana mandapams and staff is available on a 24×7 basis for conduction of all social and cultural events like
Weddings, Thread ceremony, Namakaranam, Shasti-Poorti, Anna prasana, Satyanarayana vratam, and wedding receptions etc.

All the 256 TTD Kalyana Mandapam have been brought on online booking network through the ttdsevaonline.com They include 184 in AP, 65 in Telangana, 01 in Odisha, 03 in Karnataka, 01 in Kerala and 02 in Tamil Nadu.

HOW TO BOOK ONLINE

After registration on the website ttdsevaonline.com, devotees should select their location: State, District etc., select vacancy dates, Upload their data like Aadhar card, photo Id, contact details and make payment of specified fees. Thereafter they would get an SMS, which will be their receipt, which the concerned supervisor of Kalyana Mandapam will also get a copy for verification at times of the event.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆన్‌లైన్‌లో టిటిడి కల్యాణ వేదికలు – ఆన్‌లైన్‌ బుకింగ్‌కు విశేష స్పందన

తిరుపతి, 2019 జూన్‌ 20: దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో 302 టిటిడి కల్యాణ మండపాలు ఉన్నాయి. ఇందులో 256 కల్యాణ మండపాలను ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకునే సదుపాయాన్ని భక్తులకు టిటిడి అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం విదితమే. ఆన్‌లైన్‌ సౌకర్యం కల్పించడం ద్వారా భక్తుల నుండి విశేష స్పందన వస్తోంది. దాదాపు 90 శాతం కల్యాణ మండపాలను మరింత సులభంగా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటున్నారు.

టిటిడి కల్యాణ మండపాలకు ఐఎస్‌వో గుర్తింపు ….

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం పర్యవేక్షణలో ఇటీవల కుప్పం, రాజాం, నర్సాపూర్‌, మహబూబ్‌నగర్‌, బెంగళూరులోని కల్యాణ మండపాలకు ఐఎస్‌వో గుర్తింపు లభించిన విషయం విదితమే. మొదటి దశలో 5 కల్యాణ మండపాలను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్ధారు. త్వరలో మరిన్ని కల్యాణ మండపాలకు ఐఎస్‌వో గుర్తింపు తీసుకు వచ్చేందుకు కృషి జరుగుతోంది.

అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న టిటిడి కల్యాణ మండపాల ఆధునీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా కల్యాణ మండపాలు ఆధునీకరణ పూర్తి చేసుకుని భక్తులకు అందుబాటులో ఉన్నాయి. దశలవారిగా కల్యాణ మండపాలు ఆధునిక వసతులతో అందుబాటులోనికి రానున్నాయి.

మరింత మెరుగైన సౌకర్యాలు …

టిటిడి కల్యాణ మండపాలను మరింత మెరుగైన సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, శ్రీకాకుళం జిల్లా రాజాం, తెలంగాణ రాష్ట్రం మహబుబ్‌నగర్‌లోని టిటిడి కల్యాణ మండపాలను అద్భుతంగా తీర్చిదిద్ధారు. ఇందులో భాగంగా భవనాలకు మరమ్మతులు చేసి ఆకర్షణీయంగా రంగులు వేశారు. కల్యాణ మండపంలో వంట, భోజనశాలు, వధువు, వరుడు గదులను ఆధునీకరించారు. కల్యాణమండపం లోపల ఎల్‌ఈడి లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు.

కల్యాణ వేదికపై శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవం, గోడలపై శ్రీవారి వివిధ అంకరణలతో కూడిన ఫోటోలు, బయటి గోడలపై ఆకట్టుకునేల పెయింటింగ్‌ ఏర్పాటు చేశారు. కల్యాణ మండపాలలో పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేస్తూ డ్రైనేజి, మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. కల్యాణ మండపం లోపల, బయట అహ్లాదకరంగా ఉండేందుకు పచ్చదనం పెంపొందించడంలో భాగంగా వివిధ పుష్పాల మొక్కలతో గార్డన్‌ ఏర్పాటు చేశారు.

నిరంతర పర్యవేక్షణ….

టిటిడి తిరుపతి జెఈవో ఆదేశాల మేరకు కల్యాణ మండపాల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నారు. భద్రతపరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

అందుబాటులో సిబ్బంది…

వివాహం, ఉపనయనం, నిశ్చితార్థం, నామకరణము (బారసాల), షష్టిపూర్తి, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, రిసెప్షన్‌ వంటి శుభకార్యాలు జరుగుతున్నప్పుడు కల్యాణ మండపాలలో ఎలక్ట్రికల్‌, వాటర్‌ వర్క్స్‌, తదితర శాఖలకు చెందిన సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.

ఆన్‌లైన్‌లో 256 టిటిడి కల్యాణమండపాల బుకింగ్‌ సదుపాయం…..

టిటిడి కల్యాణ మండపాలలో 256 కల్యాణ మండపాలను ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకునే సదుపాయాన్ని భక్తులకు టిటిడి అందుబాటులోకి తీసుకొచ్చింది. ttdsevaonline.com వెబ్‌సైట్‌లో టిటిడి కల్యాణమండపాలను బుక్‌ చేసుకోవచ్చు.

ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలలో 184, తెలంగాణలో 65, ఒడిశాలో 01, కర్ణాటకలో 03, కేరళలో 01, తమిళనాడులో 02 కల్యాణ మండపాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఎలా బుక్‌ చేసుకోవాలి..

ttdsevaonline.com వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అనంతరం రాష్ట్రం, జిల్లా, సంబంధిత ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. అక్కడ ఖాళీగా ఉన్న తేదీలను ఎంపిక చేసుకున్న తరువాత ఫొటోతోపాటు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లలో ఏదో ఒకటి అప్‌లోడ్‌ చేయాలి. కల్యాణమండపాల స్థాయిని బట్టి నిర్దేశించిన రుసుమును ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత సంబంధిత వ్యక్తులకు, కల్యాణమండపం పర్యవేక్షణ అధికారికి ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. ఈ ఎస్‌ఎంఎస్‌ను చూపి కల్యాణమండపంలో కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.