KALYANA VENKANNA RIDES GARUDA VAHANAM- SAKSHATKARA VAIBHOTSAVAMS CONCLUDES AT SKVST _ గ‌రుడ వాహ‌నంపై శ్రీ కల్యాణ వెంకన్న – ముగిసిన సాక్షాత్కార వైభవోత్సవాలు

Srinivasa Mangapuram, 27 Jun. 20: The ongoing annual sakshatkara Vaibhavotsavams at Sri Kalyana Venkateswara Swamy temple of Srinivasa Mangapuram concluded on Saturday with Garuda Vahanam. 

As a part of the event daily rituals of Suprabatham, Tomala Seva, Koluvu, Panchanga Sravanam and Sahasra Namarchana were performed followed by Snapana Tirumanjanam for the utsava idols of Sri kalyana Venkateswara and his consorts.

Later in the evening grand Garuda vahana seva for the utsava idols and asthanams were conducted in the temple premises. TTD EO Sri Anil Kumar Singhal took part in the fete.

TTD EO Sri Anil Kumar Singhal, Temple Dyeo Sri Yellappa, AEO Sri K Dhananjayudu, Superintendent Sri D Ramaiah  participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

గ‌రుడ వాహ‌నంపై శ్రీ కల్యాణ వెంకన్న – ముగిసిన సాక్షాత్కార వైభవోత్సవాలు

తిరుపతి, 2020 జూన్ 27: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాల్లో చివ‌రి రోజైన శ‌ని‌వారం రాత్రి స్వామివారు విశేషమైన గ‌రుడ వాహనాన్ని అధిరోహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని  మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు ఆల‌య ముఖ మండ‌పంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.

అనంతరం రాత్రి 7 నుండి 8 గంటల వరకు గ‌రుడ వాహనంపై స్వామివారు వేంచేపు చేసి ఏకాంతంగా ఆస్థానం నిర్వ‌హిస్తారు. 

జూన్ 28‌న పార్వేట ఉత్సవం :

కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాల మరుసటి రోజైన జూన్ 28వ తేదీన పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆల‌య ముఖ మండ‌పంలో ఉద‌యం 7.00 నుండి 9.00 గంట‌ల వ‌ర‌కు ఏకాంత‌గా ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా ఆల‌యంలో ఏకాంతంగా స్న‌ప‌న తిరుమంజ‌నం, వాహ‌న సేవ‌లు, ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ య‌ల్ల‌ప్ప‌, ఏఈవో శ్రీ కె.ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగల్రాయులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.