KALYANA VENKANNA RIDES SARVA BHOOLA VAHANA _ సర్వభూపాల వాహనంపై శ్రీ కల్యాణ వెంకన్న

Tirupati, 9 Mar. 21: On the penultimate day of the ongoing annual Brahmotsavam of Sri Kalyana Venkateswara temple at Srinivasa Mangapuram, the processional deity of Sri Kalyana Venkateswara Swamy took a celestial ride on Sarva Bhupala Vahanam on Tuesday morning.

TTD is organising the Vahana sevas in Ekantham in view of COVID-19 guidelines.

By riding Sarva Bhoopala vahana Sri Venkateswara Swamy indicated that He is the Supremo of all elements and blessed devotees.

Temple DyEO Smt Shanti, AEO Sri Dhananjayudu, Superintendents Sri Changalrayulu, Sri Ramanaiah and Inspector Sri Srinivasulu were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సర్వభూపాల వాహనంపై శ్రీ కల్యాణ వెంకన్న

తిరుపతి, 2021 మార్చి 09: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం స్వామివారు రథోత్సవానికి బదులుగా సర్వభూపాల వాహనంపై కటాక్షించారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం ఆల‌యంలో  ఏకాంతంగా నిర్వ‌హించారు.

భూమిని పాలించేవాడు భూపాలుడు. సమస్త విశ్వంలో లెక్కలేనన్ని సూర్యమండలాలున్నాయి. అన్ని సూర్య మండలాల్లోనూ భూమి ఉంది. ఆ భూగ్రహాలన్నింటినీ పాలించడం సర్వభూపాలత్వం. నైసర్గిక సరిహద్దులు గల కొంత భూమిపై అధికారం కలిగిన వ్యక్తి భూపాలకుడంటున్నాం. ఇలాంటి భూపాలురందరూ బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు. త‌మ ఏలుబడిలోని భూమిని కల్యాణాత్మకం చేసి రక్షించండని శ్రీవారిని ప్రార్థిస్తారు. ఇదొక విశిష్టసేవ. ఈ సేవ కోసం అందరూ ఐకమత్యంతో, భక్తిపూర్ణహృదయంతో, శరణాగతులై తామే జగత్‌ కల్యాణమూర్తికి వాహనమైపోతారు. అలా వాహనాలుగా మారిన చక్రవర్తుల భుజస్కంధాలపై కల్యాణమూర్తి కొలువుదీర‌డ‌మే సర్వభూపాల వాహనసేవ.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్లు శ్రీ చెంగల్రాయలు, శ్రీ రమణయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.